‘ముస్లింలందరినీ చంపేందుకు వెళుతున్నాను’

‘ముస్లింలందరినీ చంపేందుకు వెళుతున్నాను’

లండన్‌: ‘నేను ముస్లింలందరినీ చంపేస్తాను’  అంటూ లండన్‌లో తాజాగా వ్యాన్‌తో పాదచారులను ఢీకొట్టిన వ్యక్తి చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. దీని ప్రకారం మొన్న జరిగిన దాడి మాదిరిగానే ఇది కూడా జాతి విద్వేషపూరిత దాడి అని తెలుస్తోంది.‘నేను ఎప్పుడైతే వెనక్కి చూశానో.. అది కారు ప్రమాదం అనుకున్నాను. కానీ ప్రజలంతా కేకలు పెడుతున్నారు.. అటుఇటూ పరుగులు పెడుతున్నారు.ఆ సమయంలో ప్రార్థనలు చేస్తున్నవారినే లక్ష్యంగా ఆ వ్యక్తి ఎంచుకున్నాడు. నేను ముస్లింలను చంపేందుకు వెళుతున్నాను అంటూ గట్టిగా కేకలు పెట్టాడు. మసీదు చాలా చిన్నగా ఉండటంతో అందులో సరిపోక చాలామంది బయటే ప్రార్థనలు చేస్తున్నారు. వారినే లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడ్డాడు’ అని అబ్దుల్‌రహ్మాన్‌ శాలే అలామౌడీ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు.  
Back to Top