ఫ్రిదా.. వచ్చింది..!
న్యూఢిల్లీ : మెక్సికోలో ఎక్కడ ప్రమాదం వచ్చినా.. వెంటనే ఠక్కున స్ఫురించే పేరు.. ఫ్రిదా. ప్రమాదాలు.. యుద్ధ సమయాలు.. ప్రనకృతి విలయాలు.. ఇలా సందర్భం ఏదైనా కావచ్చు.. కానీ ప్రభుత్వానికి గుర్తుకు వచ్చే పేరు మాత్రం ఫ్రిదా. మెక్సికో దేశాధ్యక్షుడు హెన్రిక్.. ఫ్రిదా మా దేశానికి గర్వకారణం అని పేర్కొంటూ ఒక వీడియోను సోషల్ మీడిలో పోస్ట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు.. అక్కడ ఎంత ఫాలోయింగ్ ఉందో.
ఫ్రిదా.. అంటూ ఇత గట్టిగా చెబుతున్నారు.. ఇంతకూ ఆ ఫ్రిదా ఎవరూ అనే సందేహం వస్తోందా..? అయితే మీరేం కంగారు పడాల్సిన పనిలేదు.. ఫ్రిదా.. ఒక కుక్కపిల్ల. మెక్సిన్ నేవీలో రెస్క్యూ టీమ్ మెంబర్గా పనిచేస్తోంది. రెండురోజుల కిందట మెక్సికోను కుదిపేసిన భూకంపంలో శిథిల భవనాల కింద మృతదేహాలును కనుగొనడంతో పాటు.. ఎక్కడైనా కొనప్రాణంతో మిగిలినవారిని రక్షించేందుకు అక్కడి ప్రభుత్వం తాజాగా ఫ్రిదాను రంగంలోకి దించింది. అమెరికా, మెక్సికోల్లో జరిగిన అనేక ప్రమాదాల నుంచి ఇప్పటివరకూ 52 మందిని ఫ్రిదా ప్రాణాలతో కాపాడిందని మెక్సికన్ నేవీ గర్వంగా చెబుతోంది.
Ella es #Frida, #OrgulloNaval que ha logrado salvar 52 vidas en distinto desastres naturales a nivel Nacional e Internacional pic.twitter.com/icYKDofDd7
— SEMAR México (@SEMAR_mx) 13 September 2017