పిల్లి కోసం వెళితే ప్రాణాలే పోయాయి!

fire accdent two womans deat - Sakshi

గ్లెన్‌రాక్‌: అగ్నిప్రమాదానికి గురైన ఇంట్లో చిక్కుకున్న పెంపుడు పిల్లిని రక్షించడానికి యత్నించిన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఫిలడెల్ఫియాకు 145 కి.మీ పశ్చిమాన ఉన్న ష్రూస్‌బరీ టౌన్‌షిప్‌లో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

మండుతున్న ఇంటిలో చిక్కుకున్న ఇద్దరు మహిళల్ని రక్షించడానికి యత్నించిన మరో మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే తీవ్రంగా కాలిన గాయాలైన ఆమెను అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు మహిళల మృతదేహాలను ఇంటి బేస్‌మెంట్‌ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో సదరు పిల్లి కూడా చనిపోయిందన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top