
మర్యాదగా వెళితే రెండుసార్లు రేప్ చేశాడు
కలిసేందుకు వెళ్లినందుకు మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ తనపై రెండుసార్లు లైంగికదాడి చేశాడని 21 ఏళ్ల మహిళ సుందర్ లాండ్ మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ కాబ్రాల్ పై ఫిర్యాదు చేసింది.
లండన్: కలిసేందుకు వెళ్లినందుకు మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ తనపై రెండుసార్లు లైంగికదాడి చేశాడని 21 ఏళ్ల మహిళ సుందర్ లాండ్ మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ కాబ్రాల్ పై ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుకు సంబంధించి విచారణను ఎదుర్కొనేందుకు ఆయన హల్ క్రౌన్లో కోర్టుకు హాజరయ్యారు. కాబ్రాల్ అసలు పేరు అడిల్సన్ తావెరిస్ వరేలా. స్విట్జర్లాండ్కు చెందిన ఈ ప్రీమియర్ లీగ్ మాజీ ఫుట్ బాల్ ప్లేయర్. బాధితురాలు కోర్టుకు తెలిపిన ప్రకారం న్యూక్యాజిల్లోని నైట్ క్లబ్కు రాత్రి కలిసేందుకు కాబ్రాల్ గత ఏడాది రమ్మన్నాడు. దాంతో ఆమె తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి వెళ్లింది.
అనంతరం ఆమె తప్ప తన స్నేహితురాళ్లు వీఐపీ గదిలో కూర్చుని పీకల వరకు తాగారు. మందుకోసమే అతడు దాదాపు రూ.1,16,092 ఖర్చుచేశాడు. అక్కడే క్లబ్బులో ఫుల్లుగా డాన్స్ చేశారు. అనంతరం నుంచి అతడి ప్రైవేటు నివాసానికి ఓ కారు తీసుకొని వెళ్లారు. స్నేహితురాళ్లు వాష్ రూమ్కు వెళ్లగా బాధితురాలిని మాత్రం తన బెడ్ రూంకు తీసుకెళ్లి కూర్చొబెట్టాడు. అనంతరం మందు తాగుతావా అని అడిగాడు. అలవాటు లేదని చెప్పడంతో ఎందుకని ప్రశ్నించాడు. తనకు ముందునుంచే అలవాటు లేదని చెప్తుండగానే అతడు ఆమెపై రెండుసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే, ఈ క్రీడాకారుడు మాత్రం ఆమె ఆరోపణలు తప్పని చెప్తున్నాడు.