ఆగని హింస ; సోషల్‌ మీడియాపై నిషేధం

Emergency In Sri Lanka Govt Orders Blocking Of Social Media - Sakshi

కొలంబో : ఎమర్జెన్సీ కొనసాగుతున్నప్పటికీ శ్రీలంకలో హింస ఆగలేదు. బుధవారం నాడు కూడా క్యాండీలోని పలు చోట్ల బౌద్ధులు-ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి. బౌద్ధ సంఘాలకు చెందిన యువకులు కొందరు.. మసీదులను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు.

అల్లర్లు నానాటకీ వ్యాప్తి చెందుతుండటంతో ఫేస్‌బుక్‌, వాట్సప్‌ సహా ఇతర సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌లపై నిషేధం విధించారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ వర్గాలు ప్రకటన చేశాయి. అయితే, నిషేధం ఎంతకాలం ఉంటుందనేది స్పష్టంగా తెలియరాలేదు. క్యాండీ జిల్లాల్లో చెలరేగిన హింసను అదుపుచేయడంలో భాగంగా మంగళవారం నుంచి 10 రోజులపాటు ఎమర్జెన్సీని విధించిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top