పేలిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌...

Electric Scooter Exploded In China - Sakshi

బీజింగ్‌ : సెల్‌ఫోన్లు, పవర్‌ బ్యాంకులు వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు పేలిన ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇటువంటి ఘటనే చైనాలో మరొకటి చోటుచేసుకుంది. కానీ ఇక్కడ పేలింది మాత్రం సెల్‌ఫోనో, పవర్‌ బ్యాంకో కాదు ఓ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌. అసలేం జరిగిందంటే.. చైనాకు చెందిన ఓ వ్యక్తి తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని చార్జింగ్‌ పెట్టి... కూతురితో మాటల్లో మునిగిపోయాడు. కాసేపటి తర్వాత స్కూటర్‌ నుంచి పొగలు రావడంతో పక్కనే ఉన్న పెంపుడు కుక్క అరవడం మొదలు పెట్టింది. అసలేం జరిగిందో చూద్దామని దగ్గరికి వెళ్లేలోపే ఇళ్లంతా పొగలు వ్యాపించేశాయి. కొన్ని క్షణాల్లోనే స్కూటర్‌ పేలి పోయింది. అయితే అప్పటికే అప్రమత్తమైన ఆ వ్యక్తి కూతురుని తీసుకుని దూరంగా పరిగెత్తడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో వెలుగులోకి వచ్చింది. అప్‌లోడ్‌ అయిన 11 గంటల్లోపే 60 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. ‘స్మార్ట్‌ డాగ్‌.. పొగ రావడంతో ప్రమాదాన్నిముందే పసిగట్టింది. అందుకే ఆ తండ్రీకూతుళ్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారం’టూ నెటిజన్లు పెట్‌ డాగ్‌ను ప్రశంసిస్తున్నారు. కాగా ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top