మూడేళ్ల తర్వాత ఆమెను చూసిన ఆనందంలో..

Dog Gets Over Excited When See Friend In Brazil - Sakshi

బ్రెజీలియా : కుక్కలు విశ్వాసానికే కాదు.. స్నేహానికి కూడా మారు పేరని చాలా సందర్భాల్లో రుజువైంది. కుక్కకు, మనిషికి మధ్య ఉన్న అపురూపమైన స్నేహానికి బ్రెజిల్‌ వేదికైంది. మూడేళ్ల తర్వాత తన స్నేహితురాలిని(యువతి) కలుసుకున్న ఓ కుక్క భావోద్వేగానికి లోనైంది! ఆమెను ప్రేమగా చుట్టుముడుతూ.. ముద్దులు పెడుతూ తన ఆనందాన్ని వ్యక్త పరిచింది. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌కు చెందిన మరీనా విజ్‌.. ఇను స్టాక్‌ అనే కుక్కను పెంచుకుంటోంది. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. కొద్దిరోజుల తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం జర్మనీకి వెళ్లింది మరీనా. అలా మూడు సంవత్సరాలు ఇనుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎలాగైతేనేం మూడు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. వెంటనే తిరుగు ప్రయాణమై ఇంటికి వచ్చేసిందామె.

మరీనా ఇంట్లోకి అడుగుపెట్టగానే ఇను ఆమెను చూసింది. అంతే! ఆమె చుట్టూ తిరుగుతూ.. పైకి దూకుతూ.. ముద్దులు పెడుతూ పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఈ దృశ్యాల్ని చూసిన మరీనా, ఆమె కుటుంబసభ్యులు కంటతడి పెట్టుకోవటమే కాకుండా దాని ఆప్యాయతకు సంతోషపడ్డారు. మరీనా మాట్లాడుతూ.. నేను జర్మనీలో ఉన్నపుడు ఇనును తలుచుకుని రోజూ బాధపడేదానిని. ఈ జంతువులు మనుషుల మీద స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తాయి. నాకు ఇంతకంటే మంచి స్నేహితుడు దొరుకుతాడని అనుకోవటం లేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top