ఫుట్‌బాల్‌ ఆట.. విడాకుల మంట! 

Divorce between the couple with Football game - Sakshi

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌ ఫీవర్‌ పెరిగిపోయింది. అభిమాన జట్టు గెలిస్తే సంబరాలు చేసుకుంటున్నారు.. ఓడితే మాత్రం తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతున్నారు. అంతవరకు బాగానే ఉంది.. ఫుట్‌బాల్‌ ఆట ఒక జంటకు మాత్రం చేదునే మిగిల్చింది. రష్యాకు చెందిన అర్సెన్, అతడి భార్య లైద్‌మిలాలకు ఫుట్‌బాల్‌ ఆట అంటే చాలా ఇష్టం. 14 ఏళ్ల కింద 2002 వరల్డ్‌ కప్‌ ఆటల్లో వీరిద్దరూ కలిశారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే గత వారం ఆ ఫుట్‌ బాలే వీరిద్దరినీ విడదీసింది. లైద్‌మిలాకు రొనాల్డో అంటే ఇష్టం.

అర్సెన్‌ ఏమో అర్జెంటీనా జట్టుకు చెందిన మెస్సీకి అభిమాని. తొలిమ్యాచ్‌లో అర్జెంటీనా తడబడటంతో మెస్సీ ఆటతీరును లైద్‌మిలా విమర్శించిందట. అర్సెన్‌ అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత నైజీరియాతో ఆట సందర్భంగా తన భార్య మెస్సీని విమర్శిస్తే కోపం ఆపుకోలేకపోయాడట. ఎంత చెప్పినా వినకుండా విమర్శలు ఆపలేదట. ఇక కోపం నషాళానికి అంటిన మనోడు తెల్లారే సివిల్‌ కోర్టుకు వెళ్లి విడాకులకు దరఖాస్తు పెట్టుకున్నాడట. 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top