దావూద్‌ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

దావూద్‌ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?


న్యూఢిల్లీ: భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ప్రపంచంలో అత్యంత ధనవంతులైన గ్యాంగ్‌స్టర్‌ల జాబితాలో రెండోస్థానంలో ఉన్నాడు. బ్రిటన్‌లో దావూద్‌ ఆస్తుల జప్తు నేపధ్యంలో ఈ ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫోర్బ్స్‌ బిజినెస్‌ మేగజైన్‌ ఈ వివరాలు వెళ్లడించింది. కొకైన్‌ కింగ్‌గా పిలువబడే ఎస్కోబార్‌ మొదటి స్థానంలో ఉన్నాడు.అమెరికాలో ఉపయోగించే డ్రగ్స్‌లో సుమారు 80శాతం ఎస్కోబార్‌ సరఫరా చేస్తాడు. డైలీన్యూస్‌ కథనం ప్రకారం 1990ల నాటికే ఎస్కోబార్‌ 30 బిలియన్ డాలర్ల విలువైన సంపదలు ఉన్నాయని సమాచారం. అతను అత్యంత సంపన్నుడైన నేరస్థుడిగా డైలీన్యూస్‌ ప్రచురించింది. దావూద్‌కు 2015నాటికి 6.7 బిలియన్‌ డాలర్ల విలువ చేసే నికర ఆస్తులు ఉన్నాయని డైలీన్యూస్‌ తెలిపింది.


తాజాగా బ్రిటన్‌ ప్రభుత్వం  పెద్ద మొత్తంలో దావూద్‌ ఇబ్రహీం ఆస్తులను జప్తు చేసిన సంగతి తెలిసిందే.

Back to Top