కరోనా వ్యాప్తి: ఆర్థిక వ్యవస్థకు అమెరికా ప్రోత్సాహం

Covid 19 America Giving Thousand Dollars To Improve Economy  - Sakshi

వాషింగ్‌టన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. కరోనా సంక్షోభం​ వల్ల అమెరికాలోని విమానాయాన సంస్థలు, రెస్టారెంట్లు, క్రీడా సంస్థలు మూసివేసారు. వేగంగా విస్తరిస్తున్న కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు తాజాగా అగ్ర రాజ్యం అమెరికా పలు కీలక చర్యలు తీసుకుంది. పన్నులు చెలించే అమెరికన్లకు వెయ్యి డాలర్ల చెక్కులను విడుదల చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ​​​​​​ట్రంప్‌, ట్రెజరీ సెక్రెటరీ స్టీవెన్‌ ప్రతిపాదించారు. ఈ నిర్ణయానికి డెమోక్రెటిక్‌, రిపబ్లికన్‌ పార్టీల మద్దతు అవసరమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పన్ను చెల్లింపుదారులకు నేరుగా యు.ఎస్. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్‌) ద్వారా జమ చేయనున్నారు. ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆర్థికవేత్తలు ప్రశంసిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top