లింగ భేదాన్ని గుర్తించేకంప్యూటర్ మోడల్!

లింగ భేదాన్ని గుర్తించేకంప్యూటర్ మోడల్! - Sakshi


మెల్‌బోర్న్: మీరు కంప్యూటర్ ముందు కూర్చుంటే చాలు.. లింగ భేదాన్ని(ఆడో.. మగో) అదే నిర్ధారించుకుంటుంది! అంతేకాదు, ఒక వ్యక్తి ముఖాన్ని త్రీడీ స్కాన్ చేసుకుని ఆ ఆకృతిలో ఎంత మేర స్త్రీ, పురుష లక్షణాలు ఉన్నాయో కూడా అచ్చం మనుషుల్లాగే అంచనా వేస్తుంది.  ప్రపంచంలోనే తొలిసారిగా ఇలాంటి కంప్యూటర్ మోడల్ నువెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం రూపొందించింది. ఇది స్త్రీ, పురుష లింగ భేదాన్ని కచ్చితత్వంతో గుర్తించి, రేటింగ్(జెండర్ స్కోర్) ఇస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం పలు పరిశోధనల్లో ఈ ప్రక్రియ కోసం ఎంతో సమయం వృథా అవుతోందని, ఇందుకయ్యే వ్యయం కూడా ఎక్కువేనని వారు పేర్కొంటున్నారు.



అందుకే జెండర్ స్కోర్‌ను వేగంగా నిర్ధారించే గణిత మోడల్‌ని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. ఇందుకోసం 64 మంది యువతీయువకుల ముఖాల్లో కనిపించే స్త్రీ, పురుష లక్షణాలపై 75 మంది నిపుణులతో రేటింగ్ తీసుకున్నారు. దీన్ని బట్టి ముఖాకృతులకు రేటింగ్ ఇచ్చే గణిత సిద్ధాంతాన్ని కనుగొన్నారు. ఇదే ఆల్గరిథమ్‌తో కంప్యూటర్ మోడల్‌నూ సిద్ధం చేశారు. త్రీడీ స్కాన్‌తో ముఖాన్ని విశ్లేషించే జెండర్ రేటింగ్ ఇవ్వడంలో విజయవంతమయ్యారు.

 

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top