​​​​​​​విచిత్ర ఆలోచన..వింత కారు డ్రైవింగ్‌

Chinese Woman Pulled Over For Driving Bumper Car On Busy Road - Sakshi

బీజింగ్‌: ఆ రోడ్డు మొత్తం రద్దీగా ఉంది. రోడ్డుపై కార్లు, బస్సులు నిరంతరాయంగా పరుగెడుతున్నాయి. ఇంతలోనే ఓ కారును హుషారుగా డ్రైవ్‌ చేస్తూ వస్తున్న ఓ 50 ఏళ్ల మహిళను పోలీసులు అడ్డగించారు. అంత మందిని కాదని ఆ మహిళ కారునే పోలీసులు ఎందుకు ఆపారని అనుకుంటున్నారా!  దానికి ఓ కారణం ఉందండి.. ఆమె వెళ్లే కారు మాములు కారు కాదు..రోడ్లుపై తిరగడానికి అనుమతి లేని చిన్నబంపర్‌ కారు. చిన్న పిల్లల కోసం తయారు చేసే కారులో వెళ్లి పోలీసులకు చిక్కింది. ఈ విచిత్ర ఘటన చైనాలోని గుఇయాంగ్‌లో చోటు చేసుకుంది. 

గుఇయాంగ్‌ నగరానికి చెందిన ఓ 50 ఏళ్ల మహిళ నగరంలోని ఓ రద్దీ రోడ్డుపై చిన్నకారును డ్రైవింగ్‌ చేస్తూ వచ్చింది. ఇది గమనించిన పోలీసులు ఆమెను అడ్డగించి కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆమె ఆ కారులో రావడానికి గల కారణం తెలిస్తే మీరు విస్తుపోతారు.

ఆమెకి చిన్నకార్లను అమ్మే దుకాణం ఉందట. రోజూ తన ఇంటి నుంచి దుకాణానికి కారును ఇలా డ్రైవింగ్‌ చేసుకుంటూ తీసుకెళ్తుందంట. ట్రాన్స్‌పోర్ట్‌  ఖర్చులు తగ్గిండానికి అమెకు ఈ ఆలోచన వచ్చి ఉండవచ్చు. కాగా ఆమె డ్రైవింగ్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. పోలీసులు ఇదివరకే ఆమెను ఆ కారులో రోడ్డుపైకి రావొద్దంటూ హెచ్చరించారు. అయినా కూడా ఆమె అదే కారులో రోజూ వెళ్తోంది. దీంతో పోలీసులు ఆమె కారును​ స్వాధీనం చేసుకున్నట్లు లోకల్‌ మీడియా తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top