14 నిమిషాల్లో మహా విధ్వంసం

China will attack any part of the world in 14 minutes - Sakshi - Sakshi - Sakshi

బీజింగ్‌ : ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే హైపర్‌సానిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను చైనా రూపొందిస్తోంది. అణువార్‌హెడ్లను మోసుకెళ్లగలిగే సామర్థ్యంతో దీనిని రూపొందిస్తున్నట్లు చైనాకు చెందిన సౌత్ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. సెకను 12 కిలోమీటర్ల వేగంతో ఎయిర్‌క్రాఫ్ట్‌ దూసుకు వెళుతుందని పత్రిక పేర్కొంది.

కేవలం 14 నిమిషాల వ్యవధిలో ప్రపంచంలోనూ ఏ ప్రాంతాన్ని అయినా ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ చేరి.. క్షణాల వ్యవధిలో ఆ ప్రాంతాన్ని తునాతునకలు చేస్తుందంట. అంతేకాదు ఈ హైపర్‌సానిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ధ్వని వేగంకన్నా 35 రెట్లు వేగంగా ప్రయాణించగలదని తెలుస్తోంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ 2020 నాటికి అందుబాటులోకి రావచ్చని అంచనా.

చైనా 2013 నుంచి హైపర్‌సానిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీపై దృష్టి సారించింది. అందులో భాగంగా 7 టెస్ట్‌ ఫ్లయిట్లను విజయవంతంగా పరీక్షించింది. హైపర్‌సానిక్‌ గ్లైడర్‌ డీఎఫ్‌-జెడ్‌ఎఫ్‌ రకం మిసైళ్లు, అణుబాంబులను విజయవంతంగా మోసుకెళ్లడంతో పాటు లక్ష్యాన్ని ఖచ్చితంగా చేధించి సర్వనాశనం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top