కిమ్‌ ఖాతాలో దారుణ హత్యలు, సెక్స్‌ బానిసలు

కిమ్‌ ఖాతాలో దారుణ హత్యలు, సెక్స్‌ బానిసలు


ప్యాంగ్‌యాంగ్‌ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కరడుగట్టిన జీవన శైలి, వ్యవహార తీరు ఎలా ఉంటుందో తెలిసి పోయింది. ఆయన, ఆయన చుట్టూ ఉన్నవారు తప్ప మిగితా వారంతా కూడా ఎన్ని బాధలు పడుతుంటారో, ఎంతటి దురవస్థను అనుభవిస్తుంటారో ప్రపంచానికి తెలిసింది. ఒకప్పుడు కిమ్‌ నివాసాల్లోకి సెక్స్‌ బానిసగా వెళ్లి చివరకు తప్పించుకొని బయటపడిన ఓ 26 ఏళ్ల మహిళ ఉత్తర కొరియాలో కిమ్‌ పాలనలో ఉన్న కరడు గట్టిన నిజాలను ఓ మీడియాకు తెలియజేసింది. హీ యోన్‌ లిమ్‌(26) అనే ఆ మహిళ వివరాలను తెలియజేస్తూ తాను టీనేజ్‌లో ఉండగానే కిమ్‌ వద్దకు బందీగా వెళ్లినట్లు తెలిసింది. లైంగిక కార్యకలాపాలకోసం ఆమెను కిమ్‌ పరివారానికి సంబంధిచిన ఇళ్లన్నింటిలోకి తిప్పారని వాపోయింది.తనలాంటి ఎంతోమంది అమ్మాయిలను అక్కడ బంధించి తీసుకెళ్లి లైంగికంగా అనుభవిస్తుంటారని, తాము పడే చిత్ర హింసలు చూసి వారంతా ఎంజాయ్‌ చేస్తుంటారని తెలిపింది. కిమ్‌ ఆయన చుట్టు ఉన్న మనుషులంతా రాజులుగా తమను తాము భావిస్తుంటారని, వాస్తవానికి ఆయన పాలన కింద మనుషులు మాత్రం కడు బీదలుగా ఉంటారని వెల్లడించింది. సెక్స్‌ బానిసలు తీసుకెళ్లిన అమ్మాయిల్లో ఏ ఒక్కరు తప్పు చేసినా, ఒక వేళ వారికి గర్భం వచ్చినా వారిని కనపించకుండా చేస్తారని వాపోయింది. కిమ్‌ ఎంతటి క్రూరంగా హత్యలు చేయిస్తాడో తాను స్వయంగా చూశానని, ఓసారి ఓ పదకొండు మంది సంగీతకారులను అతి దారుణంగా చంపించారని గుర్తు చేసుకుంది. పోర్న్‌గ్రఫీకి పాల్పడ్డారనే ఆరోపణల కింద వారిని జనాలను చుట్టూ నిల్చొబెట్టి పొలాల్లోకి ఈడ్చుకొచ్చి ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్‌ల ద్వారా తుక్కుతుక్కుగా కాల్చిపడేశారని, ముక్కలు ముక్కలు చేశారని వణికిపోయింది.అంతేకాకుండా వారి మిగిలిన మృతదేహాలను మిలిటరీ యుద్ధ ట్యాంకులతో తొక్కించాడని తెలిపింది. కిమ్‌ హత్యాకాండకు అడ్డు చెప్పేవారే లేరని, ఆయనకు ఎవరైనా విశ్వాసంగా లేరని అనిపిస్తే వెంటనే వారిని ఉరి తీయిస్తారని కూడా వివరించింది. తొలుత తాము చైనాకు, అక్కడి నుంచి దక్షిణ కొరియాకు వచ్చి సియోల్‌లో స్థిరపడినట్లు వెల్లడిచింది. తన తండ్రి కొరియన్‌ పీపుల్‌ ఆర్మీలో విధులు నిర్వహించేవారని, 2015లో చనిపోయారని కూడా తెలిపింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top