ఇదిగిదిగో కరోనా వచ్చేదిలా..

Brazil Scientist Research On Coronavirus Spread - Sakshi

ఇప్పుడు ప్రజలకు కలల్లోనూ కరోనా కలవరమే.. అంతగా భయపెట్టేస్తోందీ వైరస్‌.. ఇంతకీ కరోనా వైరస్‌ మన కణాలకు ఎలా సోకుతుందో తెలుసా.. బ్రెజిల్‌కు చెందిన పలువురు పరిశోధకులు ప్రపంచంలోనే తొలిసారిగా అధిక తీక్షణత కలిగిన ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ సాయంతో దీన్ని ఫొటోలు తీశారు. వైరస్‌ ఎలా సోకుతుంది.. ఎలా శరీరంలో రెట్టింపు అవుతుందనే విషయాలను తెలుసుకునేందుకు బ్రెజిల్‌లోని ఒస్వాల్డో క్రూజ్‌ ఫౌండేషన్‌ కు చెందిన నిపుణులు పరిశోధనలు జరిపారు. ఈ మైక్రోస్కోప్‌ సాయంతో ఏదైనా కణాన్ని ఉన్న పరిమాణం కన్నా దాదాపు 20 లక్షల రెట్లు పెద్దగా చూడొచ్చు.

శరీరంలోకి వెళ్లిన వైరస్‌ కణాలు మొట్టమొదటగా.. కణ త్వచాన్ని టార్గెట్‌ చేస్తాయి. కణ త్వచం గుండా కణంలోకి ప్రవేశిస్తుంది. కణంలోకి వెళ్లీ వెళ్లగానే కణంలోని కేంద్రక త్వచం వద్దకు చేరుకుంటుంది. అంటే ఈ సమయంలోనే మనం ఈ వైరస్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడతామన్నమాట. ఆ తర్వాత కణంలో ఉన్న కణ ద్రవ్యంలో వైరస్‌ వృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. ఈ కణ ద్రవ్యంలోనే వైరస్‌ తన జన్యువులను అభివృద్ధి చేసుకుంటూ.. వేరే కణాలకు సోకుతూ వెళుతుంది. 

భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదరూ..
సూపర్‌మార్కెట్లు ఎలా ఉంటాయో తెలుసు కదా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి
మార్కెట్లలో కరోనా వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుంది అన్నదానిపై ఫిన్లాండ్‌ శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు నిర్వహించారు. దానికి సంబంధించిన 3డీ మోడల్‌ను విడుదల చేశారు. అవే ఈ చిత్రాలు.. ఓ సూపర్‌మార్కెట్లో కరోనా రోగి తుమ్మాడే అనుకోండి.. లేదా దగ్గాడే అనుకోండి.. ఇలా వైరస్‌ మేఘం లాంటిది ఒకటి గాలిలో కొన్ని నిమిషాలపాటు ఉంటుందని..  అతడు దగ్గిన చోటే కాదు..ఆ పక్కనున్న రెండు లేయర్ల వరకూ అది వ్యాప్తి చెందుతుందని తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top