కండలకోసం ఆల్కహాల్ ఇంజెక్షన్!

కండలకోసం ఆల్కహాల్ ఇంజెక్షన్! - Sakshi


మితిమీరిన కండలు పెంచి అరుదైన ఘనతను సొంతం చేసుకోవాలనేది అతని కల. అందుకోసం ఏకంగా జీవితాన్ని పణంగా పెట్టాడో వ్యక్తి. తన శరీరంలోకి ఆయిల్ ను మరియ ఆల్కాహాల్ ను నోటి ద్వారా కాకుండా ఇంజెక్ట్ చేసుకుని మరీ కండలు పెంచాడు.





వివరాల్లోకి వెళితే..  రొమారియో డాస్ .. బ్రెజిల్ లోని కాల్దాస్ నోవాస్ కు చెందిన అతని వయసు 25 సంవత్సరాలు. బాడీగార్డ్ గా పని చేస్తున్న అతనికి కండలపై అమితాసక్తి.  ఈ క్రమంలోనే తన  బైసిప్స్ ఎలాగా అయినా పెంచాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఎంత రిస్క్ చేసినా ఫర్వాలేదనుకున్నాడు. ఆ సమయం రానే వచ్చింది. తన భార్య ఆరు నెలల గర్భవతి ఉన్న సమయంలో ఆ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. సింతటిక్ ఫిల్లర్ సింతాల్ ను శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టాడు. కొన్నాళ్లుకు ఇంజక్షన్స్ కూడా చేతుల్లోకి దూరనంత దృఢంగా తయారవ్వడంతో తాను ప్రమాదంలో పడుతున్నట్లు గ్రహించాడు. డాక్టర్లు సంప్రదించగా ఆ ప్రయోగాలకు ఫుల్ స్టాప్ పెట్టమన్నారు.


 


'ధృడమైన కండలకోసం పడి చచ్చేవాడిని. జిమ్ లో కండలుతిరిగిన నా స్నేహితులు ఇచ్చిన సలహాతో సింథాల్ విధానాన్ని వాడడం ప్రారంభించాను.  చివరకు 25 ఇంచులు పెరిగిన కండరాలతో ఇంజక్షన్స్ కూడా చేతుల్లోకి దూరనంత దృఢంగా తయారయ్యాయి. నేను అందరికీ చెప్పేది ఒకటే. కండల కోసం జీవితంతో ప్రయోగాలు చేయకండి. కండలు కావాలనుకుని చావు అంచుల వరకూ వెళ్లొచ్చా. అది జీవితం కంటే విలువైనది కాదు' అని రొమారియో చెప్పాడు. ఇక్కడ ఇంకో కొసమెరుపు ఉందండోయ్. ఆ పెంచిన కండలతో తనను అంతా హీరోమాదిరిగా చూస్తారని భావించిన అతనికి మాత్రం చేదు అనుభవమే ఎదురైంది. స్థానికంగా ఉన్న చిన్న పిల్లలు అతడి వావు కండలని చూసి మృగం, రాక్షసుడు అని పిలవడం ప్రారంభిచడం గమనార్హం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top