బాడీ పెయింట్‌తో షాపింగ్‌ మాల్‌లో చక్కర్లు.. షాకైన ప్రజలు!

Body painted woman walks naked in a mall - Sakshi

దుస్తులేమీ ధరించకుండా బాడీపెయింట్‌ వేసుకొని ఓ మోడల్‌ షాపింగ్‌ మాల్‌లో చక్కర్లు కొట్టింది. అచ్చం జీన్స్‌ప్యాంటు, నల్లరంగు టీషర్ట్‌ వేసుకున్న తరహాలో ఒంటిపై పెయింట్‌ వేయించుకొని.. హైబూట్లు, భుజాలపై ఓ స్కార్ఫ్‌ వేసుకొని ఆమె షాపింగ్‌ మాల్‌లో తిరిగింది. ఎవరైనా తనను గుర్తిస్తారా లేదా అన్నది చూసేందుకు ఆమె ఎక్స్‌పెరిమెంట్‌ చేసంది. షాపులో తిరుగుతున్న ఆమె దుస్తులేమీ ధరించకుండా బాడీపెయింట్‌ వేసుకున్నదని పలువురి గుర్తించి షాక్‌ తిన్నారు.

కొందరు పురుషులు గుట్టుగా తమ మొబైల్‌ ఫోన్‌లో ఆమె వీడియో తీసేందుకు ప్రయత్నించారు. ఆమె నగ్నంగా ఉందని కొందరు గుర్తించి ఆశ్చర్య పోయారు. అమెరికాకు చెందిన బాడీ పెయింట్‌ ఆర్టిస్ట్‌ జెన్‌ సీడెల్‌ ఈ ప్రయోగాన్ని చేపట్టారు. మోడల్‌ మారియాకు జీన్స్‌, టీ షర్ట్‌ వేసుకున్నట్టు బాడీపెయింట్‌ వేసి.. మేరిల్యాండ్‌ టౌసన్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లో తిప్పారు. అచ్చం దుస్తుల్లాగే వేసిన బాడీపెయింట్‌తో ప్రజలను బురిడీ కొట్టించగలామా? లేదా? అన్నది తెలుసుకోవడానికే ఈ ప్రయోగం చేశామని బాడీపెయింట్‌ కళాకారులు చెప్తున్నారు. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 49 లక్షలమందికిపైగా చూశారు
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top