బంగ్లాతో విభేదాలను పరిష్కరించుకుంటాం

Bangladesh Top in India's Neighbour First Policy: Swaraj in Dhaka  - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌తో వివిధ అంశాల్లో భారత్‌కున్న అన్ని విభేదాలను చిత్తశుద్ధితో పరిష్కరించుకుంటామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ చెప్పారు. విభేదాలు ఉన్న అంశాలు ఏవనేది మాత్రం పేర్కొనలేదు. తీస్తా నది నీటి పంపకాలపై ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది.  కాగా, బంగ్లాదేశ్‌లో భారత్‌ సహాయంతో నిర్మించిన 15 అభివృద్ధి ప్రాజెక్టులను ఆమె ప్రారంభించారు.

ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ 8.7 మిలియన్‌ డాలర్లు. భారత హై కమిషన్‌కు చెందిన భవనాన్నీ ప్రారంభించారు. ‘పొరుగువారు ముందు’ అనే విధానాన్ని భారత్‌ అవలంబిస్తోందనీ, పొరుగు వారిలోనూ తమకు బంగ్లాదేశ్‌ అందరికన్నా ప్రాధాన్యం కలిగిన దేశమన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top