15 మెట్రో స్టేషన్లు మూసివేత

15 మెట్రో స్టేషన్లు మూసివేత


పారిస్‌: భారీ వర్షాల కారణంగా ఫ్రాన్స్‌ రాజధానిలో పలు మెట్రో స్టేషన్లను పారిస్‌ సబ్‌ వే అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఆదివారం రెండు గంటలపాటు ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి 15 మెట్రో స్టేషన్లను మూసివేయగా సోమవారం ఉదయం పునరుద్ధరించారు. ట్రాఫిక్‌ సాధారణంగా ఉందని పారిస్‌ ట్రాఫిక్‌ అథారిటీ వెల్లడించింది.



24 గంటల ‘ఆరంజ్‌ అలర్ట్‌’ ప్రకటించిన నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ మెటియో ఫ్రాన్స్‌ గ్రేటర్‌ పారిస్‌ రీజియన్‌తో కలిపి 12శాఖలను పునరుద్ధరణ పనులకు నియమించింది. ఒక్క రాత్రే 1700 ఎమర్జెన్సీ కాల్స్‌ వచ్చాయని, 87 కేసులు పరిష్కరించామని, వరద నీటిని పంపింగ్‌ చేయడంపైనే ఎక్కువ ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని నగర అగ్నిమాపక నిరోదక దళం తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top