107వ పుట్టినరోజు; నా సీక్రెట్‌ అదే!

107 Year Old Woman Shares Secret Of Longevity - Sakshi

న్యూయార్క్‌: పెళ్లి చేసుకోకపోడమే తన దీర్ఘాయుష్షుకు కారణం అంటున్నారు న్యూయార్క్‌కు చెందిన లూయిస్‌ సిగ్నోర్‌. బుధవారం తన 107వ పుట్టినరోజు జరుపుకున్నారు ఈ చలాకీ బామ్మ. అత్యంత సన్నిహితుల మధ్య కేక్‌ కట్‌ చేసిన  సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంతో ఉత్సాహంగా తన ఆరోగ్య రహస్యాలు వెల్లడించారు.

రోజూ బింగో ఆడతా..
‘మా ఇంట్లో వాళ్లు వ్యాయామం చేస్తే నేనూ చేస్తా. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటా. రోజూ కాసేపు డ్యాన్స్‌ చేస్తా. మధ్యాహ్న భోజనం తర్వాత బింగో ఆడతా. అలా అలా రోజు మొత్తం గడిచిపోతుంది. అయితే 107 ఏళ్లు ఆరోగ్యంగా బతకడానికి అసలు కారణం మాత్రం పెళ్లి చేసుకోకపోవడమే. అవును నేను ఒక్కసారి కూడా పెళ్లి చేసుకోలేదు. అదే నా రహస్యం. ఇంకో విషయం చెప్పనా. మా చెల్లెలికి ఇప్పుడు 102 ఏళ్లు. తను  కూడా నాలాగే. తనకు ఇంకెప్పటికీ పెళ్లి కాకూడదని కోరుకుంటుంది’ అంటూ లూయీస్‌ సరదాగా వ్యాఖ్యానించారు. కాగా అమెరికాలో అత్యధిక వయస్సు గల మహిళగా 114 ఏళ్ల అలేలి మర్ఫీ రికార్డు సృష్టించారు. ఇక ఆమె కూడా న్యూయార్క్‌ చెందిన వారే కావడం విశేషం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top