భార్యను దూరం చేశారని..


హైదరాబాద్‌: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని తన నుంచి దూరం చేశారనే మనోవేదనతో ఓ యువకుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కర్మన్‌ఘాట్‌ నిర్మలనగర్‌ కాలనీలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న మహేందర్‌ రెడ్డి అనే యువకుడు ఇటీవల ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు.ఆమెను మహేందర్‌రెడ్డి నుంచి దూరం చేయడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Back to Top