బీసీలు రాజ్యాధికారానికి పనికిరారా: వీహెచ్‌

బీసీలు రాజ్యాధికారానికి పనికిరారా: వీహెచ్‌


సాక్షి, హైదరాబాద్‌: గొర్రెలు, బర్రెలు చూసుకుని బతకడానికి తప్ప బీసీలు రాజ్యాధికారానికి పనికిరారా అని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మాట్లాడుతూ గొర్రెల పంపిణీ పెద్ద మోసమన్నారు. బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చి వారిని అధికారం నుంచి దూరం చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు.బీసీలకు ఇంకా గాడిదల పంపిణీ మాత్రమే మిగిలి ఉందని ఎద్దేవా చేశారు. దళితులకు భూములివ్వకుండా మొండిచెయ్యి చూపిం చడానికే కేసీఆర్‌ భూసర్వే అంటూ కొత్త నాటకానికి తెరలేపారన్నారు. బతుకమ్మ చీరల పేరిట నాసిరకపు చీరలను పంచి మహిళలను అవమానించారన్నారు.

Back to Top