హరీశ్‌రావును పక్కనపెట్టారు: కేసీఆర్ మేనల్లుడు

టీఆర్‌ఎస్‌లో ముసలం: కేసీఆర్ మేనల్లుడు


సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీలో ముసలం పుట్టిందని, మంత్రి హరీశ్‌రావును ఆ పార్టీలో పక్కనపెట్టారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, కేసీఆర్‌ మేనల్లుడు ఉమేశ్‌రావు అన్నారు. మంత్రి హరీశ్‌రావు మంచి పనిమంతుడని, అలాంటి వాడు కాంగ్రెస్‌ లోకి వస్తే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.


గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హరీశ్‌ రావు కూడా అవమానాలను భరిస్తూ టీఆర్‌ఎస్‌లో కొనసాగాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్సే హరీశ్‌రావుకు సరైన పార్టీ అని పేర్కొన్నారు. హరీశ్‌ వస్తే కాంగ్రెస్‌ పార్టీకి సైతం లాభం కలుగుతుందని, ఆయనను కాంగ్రెస్‌లోకి తెచ్చేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పారు.

Back to Top