గూండాల్లా టీఆర్‌ఎస్‌ నేతల దాడులు: షబ్బీర్‌ అలీ


సాక్షి, హైదరాబాద్‌: శాంతియుతంగా కామారెడ్డిలో యాత్రను నిర్వహిస్తున్న తెలంగాణ జేఏసీ నేతలపై టీఆర్‌ఎస్‌ నేతలు గూండాల్లాగా దాడులకు దిగారని మండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు మల్లు రవి, అనీల్‌కుమార్‌ యాదవ్‌లతో కలసి గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడారు. కామా రెడ్డిలో దాడులకు దిగిన టీఆర్‌ఎస్‌ నేతలపై రౌడీషీట్లు ఉన్నాయన్నారు.


టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు కీలక అనుచరులుగా ఉన్నవారే జేఏసీ చైర్మన్‌ కోదండరాం యాత్రలో విద్యార్థులు, ఉద్యమకారులపై దాడులకు దిగా రని షబ్బీర్‌ అలీ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో ఇప్పుడంతా తెలంగాణ ద్రోహులే ఉన్నారని, అçప్పుడు తెలంగాణ వాదులపై దాడులకు పాల్పడినవారే ఇప్పుడు ఉద్యమకా రులపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సమస్యలపై పోరాడుతున్న కోదండరాంను పోలీసు స్టేషన్లన్నీ తిప్పుతున్నారన్నారు.

Back to Top