చీరల అవినీతిపై విచారణ జరపాలి

The saris should be prosecuted for corruption

సాక్షి, హైదరాబాద్‌: చీరల కొనుగోలులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు చేనేత చీరలు ఇస్తామని ప్రచారం చేసి పాలిస్టర్‌ చీరలు ఇచ్చారన్నారు. ఈ చీరలు పంటపొలాల్లో పక్షులను బెదిరించేందుకు దిష్టిబొమ్మలకు కట్టడానికి తప్ప మహిళలు ధరించడానికి పనికిరావన్నారు. కాళేశ్వరం సొరంగం పనుల్లో జరిగిన ప్రమాదానికి పనుల్లో నాణ్యత లోపించడమే కారణమన్నారు. ఇందుకు మంత్రి హరీశ్‌ రావు నైతిక బాధ్యత వహించి, పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top