సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

Special trains to Sankranthi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేకంగా సువిధ రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ రైళ్ల కంటే ఈ రైళ్లలో చార్జీలు అధికంగా ఉంటాయి. హెదరాబాద్‌–కాకినాడ (07003) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 13న రాత్రి 8.15కు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.25 కు కాకినాడ చేరుతుంది. కాకినాడ–సికింద్రాబాద్‌ (07459) ట్రైన్‌ ఈ నెల 18న రాత్రి 10.30కు కాకినాడ నుంచి బయలుదేరి మర్నాడు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. సికింద్రాబాద్‌–నర్సాపూర్‌ (82714) రైలు 12న సాయంత్రం 7.15కు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది.

హైదరాబాద్‌–కొచువెలి (07115/07116) ట్రైన్‌ ఈ నెల 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 9 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి రెండో రోజు ఉదయం 3.20కి కొచువెలి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26, మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్‌ 2 తేదీల్లో ఉదయం 7.45కు బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 2 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది. భువనేశ్వర్‌–కాచిగూడ (08411/08412) రైలు ఈ నెల 11, 18, 25 తేదీల్లో ఉదయం 11.30 కు భువనేశ్వర్‌ నుంచి బయలుదేరి మర్నాడు ఉదయం 8.30కు కాచిగూడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 12, 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 3.45కు బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 1.15కు భువనేశ్వర్‌కు చేరుతుంది. సికింద్రాబాద్‌–గూడూరు (02710) రైలు ఈ నెల 11న సాయంత్రం 7.15కు బయలుదేరి మర్నాడు ఉదయం 6.40కి గూడూరు చేరుతుంది. విజయవాడ–సికింద్రాబాద్‌ మధ్య నడిచే పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నారు. 

ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరల పెంపు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 11 నుంచి 17 వరకు కాచిగూడ, సికింద్రాబాద్‌ స్టేషన్‌లలో ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరలను రూ.10 నుంచి రూ.20కి పెంచినట్లు సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు.  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top