కాంగ్రెస్‌ను ఎవరూ అంతం చేయలేరు

కాంగ్రెస్‌ను ఎవరూ అంతం చేయలేరు


మాజీ మంత్రి శంకర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌:
కాంగ్రెస్‌ పని అయిపోయిందని టీఆర్‌ఎస్‌ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని, సాధారణ ఎన్నికలు వస్తే బలాన్ని చూపిస్తామని మాజీ మంత్రి పి.శంకర్‌రావు అన్నారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పార్టీలో ఎలా పనిచేయాలనేది సోనియాగాంధీ నిర్ణయిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో షాద్‌నగర్‌ నుంచి పోటీ చేస్తానన్నారు. తిరుమల తిరుపతిలో వికలాంగులకు, వృద్ధులకు దైవదర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హైకోర్టు జడ్జికి రాసిన లేఖను సుమోటోగా తీసుకోవడం సంతోషమని శంకర్‌రావు అన్నారు.

Back to Top