టీఆర్‌ఎస్‌లోని నాన్‌ బోర్డర్స్‌ను పంపించండి


టీడీపీ డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఓయూలో నాన్‌బోర్డర్స్‌ ఎవరూ లేరని, టీఆర్‌ఎస్‌ పార్టీలోని నాన్‌ బోర్డర్స్‌ను ముందుగా బయటకు పంపిం చాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్య దర్శి మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. సోమ వారం ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన బాల్క సుమన్, బొంతు రామ్మోహన్, పిడమర్తి రవి ఏళ్ల తరబడి ఓయూలో నాన్‌బోర్డర్స్‌గా ఉన్నారన్నారు.


ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా తెలం గాణలో పాలన సాగుతోందని, ప్రజల నిరసనలు అణచివేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోం దని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ హయాం లో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలెన్నో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులపై కక్షసాధింపు ధోరణిని వీడకుంటే టీడీపీ తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Back to Top