ప్రాణం తీసిన ఫొటో సరదా | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఫొటో సరదా

Published Tue, May 30 2017 3:51 AM

ప్రాణం తీసిన ఫొటో సరదా

గోదావరిఖని: వేగంగా వస్తున్న రైలు ముందు నిలబడి ఫొటో దిగాలన్న కోరిక ఓ యువకుడి ప్రాణం తీసింది. గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన నస్పూరి సంపత్‌(32) ఓసీపీ–3 ప్రైవే టు ఓబీ కంపెనీలో డంపర్‌ ఆపరే టర్‌ గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లోని అల్వాల్‌ వద్ద మిత్రుడి వివాహం ఉండ డంతో స్నేహితులతో కలసి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం అల్వాల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో మిత్రులతో కలసి వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా నిల బడి ఫొటో దిగాలన్న కోరిక కలిగింది.

హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేసే శ్రావణ్‌కుమార్‌తో ఫొటో దిగుతుండగా... మరో స్నేహితుడు ఫొటో తీస్తున్నాడు. వెనుకనుంచి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు అతి సమీపం లోకి వచ్చినా గమనించకుండా ఏమరుపాటుగా ఉండడంతో రైలు ఢీకొని సంపత్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రావణ్‌కుమార్‌ చేయి నుజ్జునుజ్జు అయ్యింది. సంపత్‌కు భార్య, కవల పిల్లలున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement