‘డిఫెన్స్‌’ కారిడార్‌ కేటాయించండి

KTR writes to Sitaraman for Defence Production Corridor - Sakshi

రక్షణ మంత్రికి కేటీఆర్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌ :  తెలంగాణకు ‘డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ కారిడార్‌’ను మంజూరు చేయాలని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ కు మంత్రి కేటీఆర్‌ మంగళవారం లేఖ రాశారు. డిఫెన్స్‌ కారిడార్‌ ఏర్పాటుకు రాష్ట్రానికి అన్ని అర్హతలు ఉన్నాయని వివరించారు. ఇటీవలి బడ్జెట్‌లో 2 డిఫెన్స్‌ కారిడార్లను ప్రకటిం చిన కేంద్రం.. అన్నివిధాలా అనువైన తెలంగాణను విస్మరించడం అసంతృప్తికరమని పేర్కొన్నారు.

సత్వర అభివృద్ధికి చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం ఏరోస్పేస్, రక్షణ రంగాలను ప్రాధాన్యతగా గుర్తించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆదిభట్ల, అంతర్జాతీయ విమా నాశ్రయానికి సమీపంలో రెండు ఏరోస్పేస్‌ రంగ పారిశ్రామికవాడలు ఉన్నాయని, ఉత్ప త్తులు సైతం జరుగుతున్నాయని తెలిపారు. ఎలిమినేడులో మరో పారిశ్రామికవాడ, మెదక్‌ నిమ్జ్‌లో ప్రత్యేకంగా మరో ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.

రక్షణ రంగ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఇంక్యుబేటర్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలైన బోయింగ్, లాక్‌హీడ్‌ మార్టిన్‌ వంటి కంపెనీలు హైదరాబాద్‌ను తమ తయారీ కేంద్రంగా ఎంపిక చేసుకున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 26 యూనివర్సిటీలు, 700కుపైగా ఇంజనీరింగ్‌ కాలేజీలు, సుమారు 280 పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయని.. ఏటా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువత పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్నారని కేటీఆర్‌ వివరించారు.

అత్యంత అనుకూల ప్రాంతమిది
తెలంగాణ తరహాలో అన్ని అనుకూల పరిస్థి తులు (ఈకో సిస్టమ్‌) ఉన్న చోట డిఫెన్స్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తే మంచి పెట్టుబడులు వస్తాయని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ వ్యూహాత్మక ప్రదేశంలో ఉందని.. ఇక్కడ అనేక రక్షణ రంగ సంస్థలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇతర ఏ నగరానికీ లేనిస్థాయిలో హైదరాబాద్‌ ఎనిమిది లేన్ల హైæస్పీడ్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు కలిగి ఉందన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top