కాంగ్రెస్‌కు రైతుల శాపమే తగిలింది


ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌

సాక్షి, హైదరాబాద్‌:
కాంగ్రెస్‌ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నేతల్లో అజ్ఞానం మూర్తీభ విం చిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. వారి హయాంలో రైతులకు చేయలేని పనులను టీఆర్‌ఎస్‌ చేస్తుందని కాంగ్రెస్‌ నేతలు అక్కసు వెళ్లగ క్కుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యా లయంలో ఆయన మంగళవారం మాట్లా డారు.


పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రైతుల కంచంలో మట్టి కొడుతు న్నారన్నారు. 2019లో తామే అధికారం లోకి వస్తామని ఉత్తమ్‌ ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. కాంగ్రెస్‌కు రైతుల శాపమే తగిలిందని, అందుకే రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం కోల్పోయిందని, ఆ పార్టీ నేతలు శాపగ్రస్తులు అయ్యారని పేర్కొన్నారు.2019లోనే కాదు... 3019లో కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ కు ప్రజలు బుద్ధి చెప్పారని, త్వరలో మళ్లీ బుద్ధి చెప్పబోతున్నారన్నారు.

Back to Top