సికింద్రాబాద్‌– కాకినాడ మధ్య జనసాధారణ్‌ రైళ్లు


సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌– కాకినాడ మధ్య ప్రత్యేక జనసాధారణ్‌ రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు సికింద్రాబాద్‌– కాకినాడ (07086/07089) రైలు గురువారం(12న) రాత్రి 11.30కి సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం 10.40కి కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17న సాయంత్రం 4.30కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. మరో రైలు కాకినాడ– సికింద్రాబాద్‌ (07201) రైలు 17న రాత్రి 10.30కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. కాకినాడ– సికింద్రాబాద్‌ (02775) రైలు 18న సాయంత్రం 6.30కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.40కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

Back to Top