నెల రోజులు జైలు శిక్ష


విజయవాడ సబ్‌ కలెక్టర్, మున్సిపల్‌ కమిషనర్‌కు

కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు తీర్పు   సాక్షి, హైదరాబాద్‌ :
కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు విజయవాడ సబ్‌ కలెక్టర్‌ సృజన, మున్సిపల్‌ కమిషనర్‌ వీరపాండియన్, మరో ఇద్దరు అధికారులకు  హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి నెల రోజుల పాటు జైలు శిక్షతో పాటు, రూ. 2 వేల వంతున జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎమ్మెస్‌ రామచంద్రరావు ఇటీవల తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై అప్పిల్‌కు వెళ్లేందుకు తీర్పు అమలును ఆరు వారాల పాటు నిలిపేస్తున్నట్లు ఆయన తన తీర్పులో పేర్కొన్నారు.విజయవాడ, భవానీపురంలోని సర్వే నంబర్లు 106/1, 106/2ల్లోని భూమి అసైన్డ్‌ అని, దాని క్రయవిక్రయాలు చెల్లవంటూ తహసీల్దార్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ షేక్‌ అబ్దుల్‌ కలాం ఆజాద్, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు పిటిషనర్ల భూముల విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులను ఆదేశించింది. అయితే అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో పిటిషనర్లు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. 

Back to Top