డిసెంబర్‌ కల్లా ఇంటింటికీ ఇంటర్‌నెట్‌

Internet to every home  - Sakshi

మండలిలో మంత్రి కేటీఆర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే డిసెంబర్‌ నాటికి ఇంటింటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. కోటి కుటుంబాలకు 15 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

గ్రామాల్లోని పాఠశాలలు, కార్యాలయాలు, పీహెచ్‌సీలకు ఒక జీబీ స్పీడ్‌ ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందించి పౌర సేవలను సులభతరం చేస్తామని వెల్లడించారు. ఆదివారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు ప్రభాకర్, రామచందర్‌రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లో తాగునీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top