కోవింద్‌కు భారీ మెజారిటీ ఖాయం

కోవింద్‌కు భారీ మెజారిటీ ఖాయం

టీడీఎల్పీ, బీజేఎల్పీ సమావేశంలో రేవంత్, కిషన్‌రెడ్డి

 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ భారీ మెజారిటీతో గెలుస్తారని టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. టీడీఎల్పీ, బీజేఎల్పీ పక్షాలు ఆదివారం సం యుక్తంగా సమావేశమయ్యాయి. కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ ముఖ్యనేతలు మోత్కుపల్లి నర్సింహులు, నామా వెంకటేశ్వర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, అమర్‌నాథ్‌బాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు.  రాష్ట్రపతి ఎన్నికల్లో   కోవింద్‌కు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు.అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కోవింద్‌కు అండగా ఉండాలని కోరారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, ఓడిపోతామని తేలిపోయిన తర్వాత కాంగ్రెస్‌ నేతలు ఈ ఎన్నికల్లో దిగజారుడు వ్యూహాన్ని అవలం బిస్తున్నారని విమర్శించారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమకు ఓట్లేస్తారంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి రామ్‌నాథ్‌ అన్ని రంగాల్లో సమర్థుడని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.  
Back to Top