మాజీ మంత్రి ఎల్లారెడ్డి కన్నుమూత

ఎల్లారెడ్డి


ఊట్కూర్: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి ఎల్కోటి ఎల్లారెడ్డి(82) మంగళవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఈ నెల 6వ తేదీన తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో కాలుజారి కిందపడిపోవడంతో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబసభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. రోజురోజుకూ ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. ఎల్లారెడ్డి భార్య పద్మమ్మ మూడేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకు నలుగురు కుమారులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు వైద్యులు కాగా, మరో ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు.

 

అంచెలంచెలుగా ఎదిగి..

 ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఎల్లారెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. గ్రావు పంచాయుతీ వార్డు సభ్యుడిగా ఆరంభమైన ఆయున రాజకీయు జీవితం రాష్ట్రవుంత్రి స్థారుుకి చేరింది. 1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా వుక్తల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి తన రాజకీయు గురువు చిట్టెం నర్సిరెడ్డిపై విజయుం సాధించారు. అరుుతే టీడీపీ సంక్షోభం సమయంలో చంద్రబాబు పంచన చేరడంతో ఎల్లారెడ్డికి 1997లో వుంత్రి పదవి లభించింది. రాష్ట్ర వూర్కెటింగ్ వుంత్రిగా ఆయున 1999 వరకు కొనసాగారు. తిరిగి 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

 

 2004లో వుక్తల్ అసెంబ్లీ స్థానాన్ని మిత్రపక్షమైన బీజేపీకి కేటారుుంచడంతో ఎల్లారెడ్డి వుహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠల్‌రావు చేతిలో ఓటమి పాలయ్యూరు. ఆయన రాజకీయ ప్రస్థానంలో మొట్టమొదటి సారిగా విఠల్‌రావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో నూతనంగా ఏర్పాటైన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి సూగప్పపై రెండువేల పైచిలుకు ఓట్లతో విజయం సాదించారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి టీఆర్‌ఎస్‌లో చేరి మక్తల్ అసెంబ్లీ నుండి ఎన్నికల్లో పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

 

 ఎల్లారెడ్డి మృతికి సీఎం సంతాపం

 మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎల్లారెడ్డి ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం జిల్లాకు, రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ మృతికి కూడా కేసీఆర్  సంతాపం తెలియజేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top