'అప్పుల తెలంగాణగా మారుస్తున్నారు'

'అప్పుల తెలంగాణగా మారుస్తున్నారు'


హైదరాబాద్‌: రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణగా మారుస్తున్నారని దుయ్యబట్టారు.( చదవండి : రాష్ట్రం అప్పు రూ. 1.2 లక్షల కోట్లు )
మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి తోసేశారని, అప్పుల కోసమే ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మెదటి స్థానంలో ఉందని, ఈ అప్పులకు ఈ ఏడాది రూ.7,700 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోందని చెప్పారు. త్వరలోనే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా మేలుకోకపోతే తెలంగాణ మరో బీహార్లా బీమారీ స్టేట్‌గా మారుతుందని అన్నారు.

Back to Top