మల్లన్నసాగర్‌ టెండర్లపై పీటముడి

మల్లన్నసాగర్‌ టెండర్లపై పీటముడి

ప్యాకేజీలపై ఇంకా వీడని సందిగ్ధం

 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ టెండర్లపై సందిగ్ధత కొనసాగుతోంది. భారీ వ్యయంతో కూడుకున్న ఈ రిజర్వా యర్‌ పనులను ఎన్ని ప్యాకేజీలుగా విభజిం చాలన్న అంశం ఇంతవరకూ తేలలేదు. దీంతో నిర్మాణ పనుల ప్రారంభం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 5ప్రధాన రిజర్వాయర్లను మొత్తంగా రూ.10,876 కోట్లతో చేపట్టాలని నిర్ణయించగా, ఇందులో మల్లన్నసాగర్‌కు రూ.7,249.52 కోట్లను ఇప్పటికే నీటిపారు దల శాఖ ఓకే చేసింది. మిగతా నాలిగింటిలో రంగనాయకసాగర్‌ రూ.496.50కోట్లు, కొండ పోచమ్మ రూ.519.70కోట్లు, గంధమల రూ.860.25 కోట్లు, బస్వాపూర్‌ రిజర్వాయర్‌ కు రూ.1,751కోట్లకు అనుమతులిచ్చారు.ఇందులో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌ మినహా మిగతా మూడు రిజర్వా యర్లకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. కొండపోచమ్మ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించడంతో దానికి ఇప్పట్లో టెండర్లు ఖరార య్యేలా కనిపించడం లేదు. కాగా మల్లన్నసాగర్‌కు ఎలాంటి ఆటంకాలు లేకున్నా ప్యాకేజీ లపై ఎటూ తేలడం లేదు. దీని వ్యయం భారీగా ఉండటంతో 4 ప్యాకేజీలుగా విభజిం చేందుకు సాంకేతిక అనుమతులివ్వాలని ప్రా జెక్టు అధికారులు మొదట ఉన్నతాధికా రుల కు విన్నవించారు. అయితే రిజర్వాయర్‌ నిర్మా ణాన్ని 2018 చివరికి పూర్తిచేయాలంటే ఎక్కు వ ప్యాకేజీలుగా విభజించి పనులు వేగిరం చే యాలని అధికారులు భావించి దీన్ని 5 ప్యాకే జీలు చేయాలని సూచించారు.ఇటీవల దీనిపై సమీక్షించిన ప్రభుత్వం తిరిగి 4ప్యాకేజీలకే మొగ్గుచూపింది. ఈ మేరకు అధికారులు ప్రతి పాదనలు పంపగా, తిరిగి ఉన్నతాధికారులు దీన్ని నిలిపివేసినట్లు తెలిసింది.  
Back to Top