మిమ్మల్ని కార్మికులు నమ్మరు: చాడ

మిమ్మల్ని కార్మికులు నమ్మరు: చాడ - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ఇవ్వడం కొత్తేమి కాదని, వచ్చే నెల 5న జరిగే సింగరేణి ఎన్నికల కోసమే కేసీఆర్‌ ఆర్భాటం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. సీఎం ఎన్ని కుయుక్తులు పన్నినా కార్మికులు నమ్మే స్థితిలో లేరన్నారు.


రాజకీయాలకు, ప్రలోభాల కు కార్మికులు దూరంగా ఉంటారని, ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈనెల 22న భూపాలపల్లి, 23న గోదావరిఖని, 24న శ్రీరాంపూర్, 25న మందమర్రిలో సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ సంయుక్తంగా సింగరేణి ఎన్నికల సభలను నిర్వహిస్తామన్నారు. కాళేశ్వరం సొరంగం పైకప్పు కూలి ఏడుగురు కార్మికులు చనిపోవడం కాంట్రాక్టు సంస్థ వైఫల్యమని, మృతులకు ఒక్కొక్కరికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top