శ్రీనువైట్లపై భార్య ఫిర్యాదు, విత్‌డ్రా!

శ్రీనువైట్లపై భార్య ఫిర్యాదు, విత్‌డ్రా! - Sakshi


హైదరాబాద్  ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లపై గృహహింస కేసు నమోదు అయింది. తన భర్త వేధిస్తున్నారంటూ శ్రీనువైట్ల భార్య సంతోష రూప వారం క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  ఆమె ఫిర్యాదు  మేరకు పోలీసులు 498/A, 323A సెక్షన్ల కేసు నమోదు చేశారు. శ్రీనువైట్ల మానసికంగా చిత్రహింసలకు గురి చేయటంతో పాటు, భౌతిక దాడికి పాల్పిడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.


 


అయితే వారిద్దరి మధ్య  పెద్దలు రాజీ కుదిర్చినట్లు సమాచారం. దీంతో సంతోష రూప తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్  హీరోగా వచ్చిన 'బ్రూస్ లీ'  సక్సెస్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top