కొందరి వల్ల చిత్రసీమకు చెడ్డ పేరు: నటి

కొందరి వల్ల చిత్రసీమకు చెడ్డ పేరు: నటి


సాక్షి, సిటీబ్యూరో : తెలుగు చిత్రసీమలోని కొందరు ప్రముఖులకు డ్రగ్స్‌ రాకెట్‌ వ్యవహారంలో నోటీసులు రావడంపై తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన డ్రగ్స్‌ సమస్యపై ఆయన మాట్లాడుతూ.. ‘డ్రగ్స్‌ కేసులో బడా నిర్మాతల పిల్లలకు బదులు ఇతరుల పేర్లు వస్తున్నాయని కొందరు విమర్శించడం కరెక్ట్‌ కాదు. ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్‌గా ఉంది. తప్పు చేసిన వారు ఎవరైనాసరే శిక్షింపబడతారు.ఎక్సైజ్‌ డీజీ అకున్‌ సబర్వాల్‌ ఈ కేసును చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారందరూ దోషులు కారు. తప్పు చేయనివారికి తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ సపోర్ట్‌ ఉంటుంది’ అన్నారు. ‘కొందరి వల్ల తెలుగు చిత్రసీమకు చెడ్డ పేరొస్తుంది. డ్రగ్స్‌ పంపిణీ చేసే పబ్‌లను తక్షణం క్లోజ్‌ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సినిమా అవకాశాలు రాలేదని డ్రగ్స్‌కు బానిసలు కావడం సరికాదని’  తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కవిత అన్నారు.

Back to Top