హైదరాబాద్ లో కుప్పకూలిన భవనం

హైదరాబాద్ లో కుప్పకూలిన భవనం


హైదరాబాద్: నగరంలోని నానక్ రాంగూడాలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. గురువారం రాత్రి  దాదాపు10 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో శిథిలాల కింద నాలుగు కార్మిక కుటుంబాలు చిక్కుకున్నట్లు సమాచారం. ఆ భవనం సత్తుసింగ్‌ అనే వ్యక్తికి చెందినదని అధికారులు భావిస్తున్నారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు అంబులెన్సులు కూడా ఘటనాస్ధలికి చేరుకున్నాయి.సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆరో అంతస్తులో ఫ్లోరింగ్ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో ఎంత మంది చిక్కుకుపోయారన్న దానిపై స్పష్టత లేదు.


భవన యజమాని సత్యనారాయణ్ సింగ్(సత్తూ సింగ్) 360 గజాల్లో ఆరు అంతస్తులతో పాటు పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే రెండు అంతస్తులను సత్యనారాయణ అద్దెకు ఇచ్చారు. విషయం తెలుసుకున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

                                  


                                        మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండీ
 

Back to Top