ఏపీజీవీబీలో రూ.12 కోట్ల కుంభకోణం?


ఇస్నాపూర్‌ శాఖలో ఉద్యోగి నిర్వాకం



పటాన్‌చెరు: పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ ఏపీజీవీబీ (ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌) శాఖలో రూ.12 కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని తెలు స్తోంది. ఖాతాల్లోని నగదును ఓ ఉద్యోగి తమకు తెలిసిన వారి ఖాతాల్లోకి మళ్లిం చారంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై బ్యాంకు మేనేజర్‌ రమణమూర్తిని విలేకరులు ప్రశ్నించగా తమ బ్యాంకు శాఖలో ఉద్యోగి దుర్గాప్రసాద్‌ అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎంత మొత్తం అనే దానిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉందన్నారు. దుర్గాప్రసాద్‌ కొద్ది రోజుల నుంచి బ్యాం కుకు రావడం లేదని చెప్పారు.



ఎవరి ఖాతా నుంచి ఎంత సొమ్ము ఎక్కడికి వెళ్లిందనే దానిపై ఆడిట్‌ చేస్తున్నామని, మొత్తం ఎంత సొమ్ము పక్కదారి పట్టిందనే వివరాలను తర్వాత వెల్లడిస్తామన్నారు. ఆర్టీజీఎస్, నెఫ్ట్‌ విధానంతో ఇతరుల ఖాతాల్లోని సొమ్మును దుర్గాప్రసాద్‌ పక్కదారి పట్టించారని భావి స్తున్నారు. సొమ్మును షేర్‌ వ్యాపారానికి మళ్లించారనే ప్రచారం సైతం ఉంది.  రుణాల మంజూరులో బ్యాంకు ఉన్నతాధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ‘సాక్షి’కి ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేసి దుర్గాప్రసాద్‌ హౌసింగ్‌ లోన్లను బినామీ ఖాతాల్లోకి మళ్లించారని ఆరోపించారు.   కొంత కాలంగా లావాదేవీలు నిర్వహించి వారి పేర్లపై గృహ రుణాలు మంజూరు చేయించారని చెప్పారు. కుంభకోణం విషయమై బ్యాంకు అధికారులు పటాన్‌ చెరు పోలీసులకు ఫిర్యాదు చేసినా దానిని మాత్రం ధ్రువీకరించలేదు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top