అధినేత రక్షణ కోసం ఫిరాయించిన ‘త్యాగశీలురు’

Is Any Intention For TDP MPs Join In BJP - Sakshi

ప్రత్యర్థి పార్టీలను బలహీనపరిచి పబ్బం గడుపుకోవడానికి గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన చంద్రబాబు చివరికి ఆత్మరక్షణ కోసం వాటినే ఆశ్రయించే దుస్థితి దాపురించింది. బాబు బినామీలుగా అందరికీ తెలిసినవారు బీజేపీలోకి ఎందుకు ఫిరాయించారో, దీని వెనకున్న వ్యూహమేమిటో అందరికీ తెలుసు. అందుకే వారి ఫిరాయింపుపై మిగిలిన తెలుగుదేశం ఎంపీలు ఎవరూ మొదట్లో మాట్లాడలేదు. ఆ తర్వాతైనా గట్టిగా వ్యతిరేకించలేదు. అసలు విషయమేమంటే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ బలహీనపడటం అన్నది చంద్రబాబుకు పెద్ద లెక్క కాదు. కటకటాల్లోకి పోకుండా చూసుకోవడం ఆయనకు ప్రధానం. సుజనా, సీఎం రమేష్‌లు బాబు బినామీలని ఆరోపించిన బీజేపీ వారిని అక్కున చేర్చుకుంది. స్వర్గీయ ఎన్టీఆర్‌ స్థాపించిన విలువలను బాబు తుంగలో తొక్కారు. అక్రమ సంపాదనాపరులను చట్టసభలకు పంపారు. కేంద్రమంత్రుల్ని చేశారు. చివరకు సుజనా, సీఎం రమేష్, నారాయణవంటివారు పార్టీనే శాసించే స్థితికి ఎదిగారు.  

ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి ఫిరా యించిన ఉదంతాన్ని గమ నిస్తే షేక్స్‌పియర్‌ను మిం చిన గొప్ప నాటక రచయిత ప్రపంచంలో మరొకరు లేరని బలంగా నమ్మేవారు సైతం తమ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు. ఫిరాయించినవారి చరిత్ర సాధారణమైనది కాదు. ఆ పార్టీకి కళ్లూ, చెవులూ... అన్నీ వారే. యలమంచిలి సుజనాచౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌ రావు, టీజీ వెంకటేష్‌... వీరంతా ఎవరికి వారే సాటి. తమ అధినేత విదేశాల్లో విహారయాత్రలు సాగిస్తున్న సమయంలో ఈ నలుగురూ బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుణ్ణి కలిసి తమ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు లేఖ సమర్పించారు. అంతే... ఆ తర్వాత ఆగమేఘాల మీద అంతా సాఫీగా సాగిపోయింది. కొన్ని గంటల వ్యవధిలో రాజ్యసభ సెక్రటేరియట్‌ వీరిని బీజేపీ సభ్యులుగా పరిగణిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వెబ్‌ సైట్‌లో ఆ నలుగురూ బీజేపీ ఎంపీలుగా ‘మారిపో యారు’. వెంకయ్య విలీనానికి ఆమోదం తెలపలేదని కొన్ని కథనాలు వినబడ్డాయి. మరి దీన్ని రాజ్యసభ సెక్రటేరియట్‌ ఎలా ప్రకటించిందన్నది బిలియన్‌ డాలర్ల ప్రశ్న. 

టీడీపీ జాప్యంలో మర్మమేమిటి?
ఈ తంతు అంతా ముందస్తు స్క్రిప్ట్‌ ప్రకారం నడిచిందన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలిగితే ఆ తప్పు వారిది కాబోదు. విలీనం నాటకం సాగుతు న్నంతసేపూ  మిగిలిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు లోక్‌సభ సభ్యులు చేష్టలుడిగినట్లు ఉండి పోయారు. దీనితో తమకు సంబంధం లేనట్టు లోక్‌ సభ స్పీకర్‌గా కొత్తగా ఎన్నికైన ఓం బిర్లాను అభి నందించి వచ్చారు. ఈ ఫిరాయింపుల మాటేమిటని మీడియా ప్రతినిధులు వెంటబడితే మొక్కుబడిగా ఖండించారు. 24 గంటలు గడిచాక వెంకయ్యకు లేఖ ఇచ్చినా ఆ నలుగురినీ బీజేపీ సభ్యులుగా ఎలా గుర్తి స్తారని అందులో ప్రశ్నించలేకపోయారు. పార్టీలో చిన్న సంక్షోభం తలెత్తినా హడావుడి చేయడం,  నాయకులతో మీడియా సమావేశాలు పెట్టించి తిట్టిం చడం బాబుకు అలవాటు. కానీ ఈసారి ఆయన వేదాంత ధోరణిని ప్రదర్శించారు. పార్టీ నేతలకు ఫోన్‌చేసి ‘బీజేపీ మనలను దెబ్బ కొట్టాలని చూస్తోంది.. సంక్షోభాలు మనకు కొత్తకాదు.. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. పార్టీ మారినవారు భవిష్య త్తులో పశ్చాత్తాప పడకతప్పదు’ అంటూ తెలివిగా మాట్లాడారు. అధినేత అంతరంగం గ్రహించని ఒకరి ద్దరు నేతలు తొలిరోజున ఫిరాయింపుదారులపై విరు చుకుపడ్డారు. అంతా తెలిశాక మూగనోము పట్టారు. గతంలో ‘ఓటుకు కోట్లు’ కేసులో దొరికిన సహచ రుడు రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపింది బాబేనన్న రహస్యాన్ని పార్టీలో ఎవరిని కదిపినా చెబుతారు.  
 
నిజాలు దాస్తే దాగవు

కొన్ని నేరాలు, ఘోరాలు జరిగినపుడు వాటికి సం బంధించిన సాక్ష్యాలు దొరకవు, వాటి వెనుకనున్న కుట్రలు అంతుబట్టవు. అంతమాత్రం చేత చట్టం ఊరుకోదు. నేరం ఎలా జరిగింది? కుట్రదారులె వరు? అన్న అంశాల్ని లోతుగా పరిశీలిస్తుంది. తగిన ఆధారాలు సేకరిస్తుంది. వీటినే పరిస్థితుల దృష్ట్యా సాక్ష్యం (ఇజీటఛిuఝట్ట్చn్టజ్చీ∙్ఛఠిజీఛ్ఛీnఛ్ఛి) అంటారు. ఇంతకూ బాబుకు కుడి, ఎడమలుగా ఉన్నవారు ఎందుకు ఫిరాయించారు? ‘పరిస్థితుల దృష్ట్యా సాక్ష్యాన్ని’ ప్రజాకోర్టు ముందు పెడితే అంతా తేట తెల్లం అవుతుంది. ఫిరాయింపులు ఆ రెండు పార్టీల అంతర్గత వ్యవహారం కాదు. ప్రజాస్వామ్య విలువ లకు సంబంధించినవి. ఫిరాయించిన వారిలో ఇద్దరు –సుజనా, సీఎం రమేష్‌లపై ఆర్థిక నేరాల అభియోగా లున్నాయి.వారి ఇళ్లపై ఐటీ,ఈడీ దాడులు జరిగాయి. వీటిని కక్షపూరిత చర్యగా బాబు, ఇతర నేతలు అభి వర్ణించారు. ప్రధానిని ఆర్థిక ఉగ్రవాది అన్నారు. అందుకు బదులుగా ఆ ఇద్దరూ బాబు బినామీలని బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. ఇదంతా ఎన్నికల ముందునాటి సంగతి. 

మారిన దృశ్యం
ఎన్నికల ఫలితాలు టీడీపీ నేతలను భీతావహుల్ని చేశాయి. తిరుగులేని ప్రజాదరణ పొందిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకా రం చేయకముందే అవినీతిని సహించేది లేదంటూ స్పష్టం చేయడంతో భవిష్యత్‌ ముఖచిత్రం బాబు కళ్లకు కట్టింది. జరగబోయేదేమిటో ఆయన ఊహించ గలరు. నాలుగు దశాబ్దాల అనుభవం మరి! అందుకే తమ పార్టీ ఇకపై తటస్థంగా ఉంటుందని యూటర్న్‌ తీసుకున్నారు. ఆ రకంగా కాంగ్రెస్‌తో కలిసి ప్రయా ణించబోమని బీజేపీ అధినాయకత్వానికి తేల్చి చెప్పారు. బాబుకు ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ బల హీనపడటం అన్నది పెద్ద లెక్క కాదు.  చేసిన అవి నీతి, అక్రమాలకు కటకటాలపాలు కాకుండా చూసు కోవడం ప్రధానం. అందుకే ఈ లాలూచీ రాజకీయ మంతా సాగింది. మారిన పరిస్థితుల్లో ఓటుకు కోట్లు, ఐటీ గ్రిడ్స్‌ తదితర కేసుల్లో ఊరట దొరకవచ్చు. కానీ  నైతికంగా చంద్రబాబు పాతాళా నికి పడిపోయారు.  

ఎన్టీఆర్‌ టీడీపీలో యువతను, అతి సామాన్యు లను ప్రోత్సహించారు. పెద్దల సభగా పిలుచుకొనే రాజ్యసభకు మొదట్నుంచీ విద్యావంతుల్ని, నిజా యితీపరుల్ని పంపడం ఆనవాయితీగా పెట్టుకొ న్నారు. ఆయన్ను పదవీచ్యుతుణ్ణి చేసిన కొత్తలో బాబు  పార్టీలో మిశ్రమ సంస్కృతి–అంటే కొంత మేర సిద్ధాంతం, ఎక్కువ శాతం డబ్బు రాజకీయం ప్రవేశపెట్టారు. కానీ చివరకు డబ్బుతోనే రాజకీయం అన్న సిద్ధాంతం బాబుకు ఒంటబట్టింది. అది పోను పోను వెర్రితలలు వేసింది. 2009 నుంచి పార్టీలో పూర్తిగా కార్పొరేట్‌ సంస్కృతి ముదిరింది. సుజనా, రమేష్, నారాయణ లాంటివారు డబ్బుతో పార్టీని శాసించే స్థితికి చేరారు. సంపన్నులు చట్ట సభలకు ఎంపిక కావడం తప్పు కాదు.  కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలతో నడమం త్రపు సిరి పొందినవారిని ప్రజాప్రతినిధులుగా పం పడం, వారు కేంద్రమంత్రులు కావడం టీడీపీ పతనా వస్థకు పరాకాష్ట. ఇంతకూ ఈ ఫిరాయింపులు అధి నేతను రక్షించుకోవడానికి చేసినవి కనుక వారిని త్యాగమూర్తులు అనాలేమో?! ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడానికి ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన బాబు చివరకు ఆత్మరక్షణ కోసం వాటినే ఆశ్రయిం చడం ఓ సరికొత్త పోకడ. 

వ్యాసకర్త మాజీ ఎంపీ
అభిప్రాయం
సి.రామచంద్రయ్య

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top