ఆ కల్లోలానికి అంతం లేదా?

లాహోర్, అమృత్‌సర్‌ దొంగ సంధుల ద్వారా సిక్కు నాయకులను లోబరుచుకున్న ఫలితం– సిక్కు రాష్ట్రం కాస్తా బ్రిటిష్‌ సామంత ప్రాంతంగా మారింది. ఆపైన బ్రిటిష్‌ వాడికి కప్పం చెల్లించలేని స్థితి. సిక్కులను మోసగించిన రాజా గులాబ్‌సింగ్‌ ఈస్టిండియా కంపెనీకి బియాస్‌– సింధు నదుల మధ్య కశ్మీరీలకు చెందిన ప్రాంతాలను అమ్మేశాడు. ఈ పరిణామాల పట్ల, ఉపఖండ విభజనకు దారితీసిన పరిస్థితులపట్ల గాంధీజీ తీవ్ర వేదనను అనుభవించారు. అనేక దేశీయ, విదేశీయ కుట్రల మధ్య జరిగిన ఉపఖండ విభజన ఫలితంగా కశ్మీర్‌ ప్రజానీకం సుఖసంతోషాలకు దూరంగా ఉండిపోయారన్న వాస్తవాన్ని ఇప్పటికైనా గుర్తించాలి.

‘జమ్మూకశ్మీర్‌లో ఏనా టికైనా కశ్మీరీల దయ, అను గ్రహమే శాశ్వత శాసనం కావాలని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించను. చివరికి అక్కడి మైనారిటీ హిందువులకు చెందిన మహారాజా, మహారాణి కూడా ఈ సత్యాన్ని అంగీ కరించారు. ఎందుకంటే కశ్మీర్‌ను ఈ దుస్థితికి తీసుకు రావడానికి కారణం –1846 నాటి అమృత్‌సర్‌ సంధి. ఇది కేవలం కశ్మీర్‌ ప్రజలనూ వారి భూభాగాన్నీ మహారాజా గులాబ్‌సింగ్‌ అధికారం కోసం ప్రభు త్వానికి (ఈస్టిండియా కంపెనీకి)కట్టబెట్టిన విక్రయ దస్తావేజు.’
మహాత్మా గాంధీ (1947, ఆగస్ట్‌)

భారత ఉపఖండ విభజనకు బీజాలు వేసి, హిందూ ముస్లిం ఐక్యతకు గండి కొట్టిన పరిణామా లన్నీ అమృత్‌సర్‌ సంధి చలవేనని గుర్తించాలి. ఈ సత్యాన్ని గాంధీజీ గుర్తించినంత వేగంగా (జిన్నా తప్ప) గుర్తించిన ఇతర ప్రసిద్ధ స్వాతంత్య్ర సమర యోధులు ఎవరూ లేరు. ఇంతకీ హిందూ మైనారి టీల తరఫున గులాబ్‌సింగ్‌ కశ్మీర్‌ను, అక్కడి ప్రజ లను సంతలో సరుకులా విక్రయించడానికీ అమృత్‌ సర్‌ సంధి అధికారికంగా ధ్రువీకరించడానికీ చెల్లిం చిన మొత్తం కేవలం రూ. 75 లక్షలు. బ్రిటిష్‌–సిక్కుల యుద్ధాల మధ్య గులాబ్‌సింగ్‌ కబళించిన భూభా గాల పుట్టుపూర్వోత్తరాలు, అమృత్‌సర్‌ సంధి వంటి పరిణామాలను ఉర్దూ కవి హఫీజ్‌ జలంధర్‌ క్రోధంతో రాసిన కవిత– పచాత్తర్‌ లాక్‌ కా సౌదా (75 లక్షల రూపాయలకు కశ్మీర్‌ అమ్మకం).

‘కశ్మీర్‌ ప్రజల భవిష్యత్తును డెబ్బయ్‌ అయిదు లక్షలకు కుదువపెట్టారు/ స్వర్గతుల్యమైన కశ్మీర్‌ విలువను డెబ్బయ్‌ అయిదు లక్షలకు కుదించారు/ ఔను, డెబ్బయ్‌ అయిదు లక్షలకే/ ఔను నమ్మండి! కేవలం డెబ్బయ్‌ అయిదు లక్షలకే సుమా! అందుకే– కశ్మీర్‌ లోయలో ధ్వనించిన సింహగర్జనకు పర్వతాలలో ప్రతి ధ్వని/ శ్రామికులలో చైతన్యం/ మేల్కొన్న రైతాంగం /దిక్కుదిక్కునా వినిపిస్తున్న స్వాతంత్య్ర నాదాలు’ అంటూ సాగిందా కవిత. లాహోర్, అమృత్‌సర్‌ దొంగ సంధుల ద్వారా సిక్కు నాయకులను లోబరు చుకున్న ఫలితం– సిక్కు రాష్ట్రం కాస్తా బ్రిటిష్‌ సామంత ప్రాంతంగా మారింది. ఆపైన బ్రిటిష్‌ వాడికి కప్పం చెల్లించలేని స్థితి. సిక్కులను మోస గించిన రాజా గులాబ్‌సింగ్‌ ఈస్టిండియా కంపెనీకి బియాస్‌– సింధు నదుల మధ్య కశ్మీరీలకు చెందిన ప్రాంతాలను అమ్మేశాడు. ఈ పరిణామాల పట్ల, ఉప ఖండ విభజనకు దారితీసిన పరిస్థితుల పట్ల గాంధీజీ తీవ్ర వేదనను అనుభవించారు. అనేక దేశీయ, విదేశీయ కుట్రల మధ్య జరిగిన ఉపఖండ విభజన ఫలితంగా కశ్మీర్‌ ప్రజానీకం సుఖసంతోషాలకు దూరంగా ఉండిపోయారన్న వాస్తవాన్ని ఇప్పటికైనా గుర్తించాలి.

తప్పిదం ఎవరిదైతేనేం, విభజన జరిగిపో యింది. కాబట్టి పాకిస్తాన్‌కు రూ. 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని స్వతంత్ర భారత పాలకులను సిఫారసు చేసిన గాంధీజీని మతశక్తులు పొట్టన పెట్టుకున్నాయి. అయినా ఇరు దేశాలలోని అలాంటి శక్తులు అక్కడితో ‘తృప్తి’ చెందకుండా కశ్మీర్‌ను చీల్చే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ చీలుబాట కార్య క్రమం కొనసాగుతూనే ఉంది. ఈ విషాదకర పరి ణామాలలో కాంగ్రెస్, బీజేపీ రెండూ సమ ఉజ్జీలు గానే ఉన్నాయి. అందుకే ఏజీ నూరానీ వంటి న్యాయ నిపుణుడు స్వతంత్ర కశ్మీర్‌ నినాదం గురించి ఇలా వ్యాఖ్యానించవలసి వచ్చింది. ‘స్వతంత్ర కశ్మీర్‌ నినా దాన్ని, కోరికను కుర్దిష్‌ తదితర తెగల కోరికతో పోల్చరాదు. కనుక జమ్మూకశ్మీర్‌లోని ప్రజల అను మతితో రెండు ప్రాంతాలకూ (ఇండియా, పాకిస్తాన్‌ లలో) గరిష్ట స్థాయిలో స్వపరిపాలనా ప్రతిపత్తిని గుర్తించాలి.

అధీన నియంత్రణ రేఖతో నిమిత్తం లేకుండా, ఉభయ దేశాల సంయుక్త యంత్రాంగం కింద నిస్సైనికీకరణకు వీలుగా పాకిస్తాన్‌తో ఒప్పం దం ప్రజల అనుమతితో కుదుర్చుకోవడం ఉత్తమం’ అని నూరానీ స్పష్టం చేశారు (‘ది కశ్మీర్‌ డిస్ప్యూట్‌ 1947–2012; వాల్యూం–2). అంతేకాదు, గతంలో జరిగిన, జరుగుతున్న పరిణామాలను గురించి ఉతికి పారేస్తూ నూరానీ జీవితాంతం ప్రజాబంధువుగా నిలబడిన జయప్రకాష్‌ నారాయణ్‌ స్మృతికి, కశ్మీర్‌ ప్రజలకూ అంకితం చేస్తూ ఇలా నివాళులర్పించారు: ‘మొగలాయీల, ఆప్ఘన్‌ల, సిక్కుల, డోగ్రాల ఆక్ర మణ కింద, పాలన కింద అనేక శతాబ్దాలుగా కశ్మీర్‌ ప్రజలు బాధలు అనుభవించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వస్తే వారి ఆనందానికి హద్దు లేదు, అయితే ఇండియా, పాకిస్తాన్‌ నాయకుల కింద, తమ తమ సొంత నాయకులైన నెహ్రూ, జిన్నా, షేక్‌ అబ్దుల్లా సహా ఈనాటి నాయకుల వరకూ వారు విద్రోహాలు అనుభవించారు’.

1953 దాకా స్నేహ వాత్సల్యంతో కొనసాగిన కశ్మీర్‌ ప్రధాని, కశ్మీర్‌ సింహం షేక్‌ అబ్దుల్లాతో చెట్టాపట్టాలు కట్టిన భారత ప్రధాని పండిట్‌ నెహ్రూ. ఇండియా–పాకిస్తాన్‌ల మధ్య కశ్మీర్‌ ప్రతిపత్తి గురించిన తుది ఒప్పందాన్ని సిద్ధం చేసేందుకు అబ్దుల్లా ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. దానికితోడు కశ్మీర్‌ నాయకులు బక్షీ, సాది క్‌లు కశ్మీర్‌ లోయలో జనవాక్య నిర్ధారణ (ప్లెబిసైట్‌) డిమాండ్‌తో (1953) ముందుకొచ్చారు. ఇది నెహ్రూ చెవిన పడింది. నెహ్రూ ఆ గందరగోళంలో అబ్దు ల్లాను ‘తప్పుడు ఆరోపణల’పైన అరెస్టు చేశారు (1953). ఈ విషయాన్ని కశ్మీర్‌ శాసనసభ ద్వారా ప్లెబిసైట్‌ ప్రతిపాదనకు ధృవీకరణ పొందాలని అబ్దు ల్లాను కోరాడు. కశ్మీర్‌ ప్రధానమంత్రి పదవి నుంచి తనను నెహ్రూ తొలగించి, దీర్ఘకాలం పాటు జైల్లో ఉంచాడని, ఇది విశ్వాసఘాతుకమని, నమ్మక ద్రోహ మనీ అబ్దుల్లా  ప్రకటించాల్సి వచ్చింది.

అదే సమయంలో కశ్మీర్‌ సమస్య పరిష్కారంలో భాగంగా కశ్మీర్‌ రాజ్యాంగంలో దాని భద్రత కోసం ఏకగ్రీవంగా చేసిన ‘370’ ప్రత్యేక నిబంధనను కాస్తా 1949లో ఏకపక్షంగా నెహ్రూ ప్రధానమంత్రి హోదా లో మార్చేశారు. ఆ తర్వాత 1952 నాటి ఢిల్లీ ఒప్పం దాన్ని కూడా నెహ్రూ రద్దు చేశారు. తర్వాత తన ఇష్టానుసారం (నేటి బీజేపీ పాలకుల్లా) గవర్నర్‌ను నియమించారు. ఇప్పుడు కశ్మీర్‌లో సరిహద్దుల అవ తలనున్న పాకిస్తాన్‌ టెర్రరిస్టులు భారత భూభా గంతో అధీన రేఖ దాటి కశ్మీర్‌ గ్రామాలపై దాడులకు పాల్పడుతున్నారన్న ఆరోపణల ఆధారంగా ‘సర్జికల్‌ ఆపరేషన్స్‌’కు పాల్పడవలసి వచ్చింది. ఈలోగా జమ్మూ–కశ్మీర్‌ ఎన్నికలలో కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరె న్సుతో తెగతెంపులు చేసుకున్న పీడీఎఫ్‌ నాయకు రాలు మెహబూబా ముఫ్తీతో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నాయకుల వ్యవహారం మూన్నాళ్ల ముచ్చటయింది.  మెహబూ బాపై ఆరోపణలతో ఆమె ప్రభుత్వం నుంచి తప్పు కుని బీజేపీ దాన్ని ముంచేసింది. ఇప్పుడు రెండు పార్టీలూ పరస్పర ఆరోపణల మధ్య ఉనికిని సంక్షో భంగా మార్చుకున్నాయి.

అసలు  2014లో దేశపాలన చేపట్టిన తర్వాత దాదాపు అన్ని రాష్ట్రాలకూ (కొన్ని బీజేపీ పాలిత ప్రాంతాలకూ) వివాదాస్పద నిర్ణయాలతో బీజేపీ తలనెప్పి తెచ్చి పెట్టింది. రాజ్యాంగాన్నే మార్చేసే లక్ష్యంతో, న్యాయ వ్యవస్థ మెడలు వంచే విధానా లతో, రాజ్యాంగం పూచీ పడిన ప్రాథమిక హక్కులు సహా సర్వ రంగాలలోనూ కేంద్రం జోక్యం పెరిగి పోతోందని మరచిపోరాదు. ఈ పూర్వ రంగంలో గాంధీజీ మాటలు మరచిపోరాదు: ‘కశ్మీర్‌ సార్వ భౌమాధికారం కశ్మీర్‌ ప్రజలదే. నాయకులు కాదు, వారే హక్కుదారులు. పాలకులనేవాడు ప్రజలకు సేవ చేసేవాడని మాత్రమే అర్థం. కశ్మీర్‌లో అధికారం అక్కడి ప్రజలది మాత్రమే. వారిష్టమొచ్చిన నిర్ణ యాలు చేసుకునే అధికారం స్వయంప్రతిపత్తి వారి కుంది’ అన్నారాయన. మాటలో మాట– గాంధీకి మించిన మాటను– ‘స్వయంప్రతిపత్తి అనేది కశ్మీర్‌ ప్రజల హక్కు’ అన్నమాటకు మించి కశ్మీర్‌ కాంగ్రెస్‌ నేతలు సైఫుద్దీన్‌ సోజ్‌గానీ, అజాద్‌ గానీ అదనంగా ఏమన్నారు? ఇలాంటి, ఈ మాత్రపు అభిప్రాయాల్ని గాంధీజీయే కాదు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కూడా వ్యక్తం చేశారు. ఆయన నెహ్రూ ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి కశ్మీర్‌ ప్రతిపత్తిలోని మౌలికమైన లోగుట్టు అంశాలను ఇలా బయటపెట్టారు

‘మన దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించిన బిల్లునంతా పరిశీలిస్తే ఏమనిపిస్తోందంటే– మనకు సాయం రాగల, మనం ఆధారపడగల మిత్రులంటూ మనకు లేరన్న అభిప్రాయం కలుగుతోంది.. ఇది మనం అనుసరించదగిన సరైన విదేశాంగ విధాన మేనా అని ఆశ్చర్యం కల్గుతోంది. మన పొరుగు పాకిస్తాన్‌తో పోరాటం అనేది మన విదేశాంగ విధా నంలో భాగమే అయితే, నేనా దృక్పథంతో పూర్తిగా సంతృప్తిపడటం లేదు. ఇందుకు రెండు కారణాలు న్నాయి: 1. కశ్మీర్, 2. తూర్పు బెంగాల్‌ (నాటి బంగ్లా దేశ్‌)లో మన ప్రజల స్థితిగతులు. ఇది చాలక కశ్మీర్‌ సమస్యపైనే మనం ‘పందెం’ కాస్తున్నాం, ఒక అవాస్త విక సమస్యపైన తలపట్లు పడుతున్నాం. ఇంతకూ అసలు ప్రధాన సమస్యల్లా– ఎవరిది సబబు? ఎవరు కాదు? సరైన పరిష్కారమల్లా కశ్మీర్‌ విభజనే.’

మనం వల్లిస్తున్న ‘పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌’ను అలా (పీఓకే) పిలవడం మానాలని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సలహా చెప్పడం∙అంబేడ్కర్‌ అభిప్రాయాన్ని బట్టేనా? గావుకేకల వల్ల కశ్మీర్‌కు రాజ్యాంగబద్ధంగా కల్పించిన ‘370’వ నిబంధన తొలగదు. అందుకే హిందూ మహాసభ, జనసంఘ్‌ నాయకుడూ నెహ్రూ క్యాబినెట్‌లో మంత్రి∙శ్యాంప్ర సాద్‌ ముఖర్జీ కూడా కిమ్మనకుండా ఆ నిబంధనను ఆమోదించవలసి వచ్చింది. అన్నింటికన్నా మించిన వాస్తవం– కశ్మీర్‌లో దఫదఫాలుగా వినిపిస్తున్న ‘ప్లెబి సైట్‌’ నిర్వహించాలన్న డిమాండ్, ఉభయప క్షాల ఫిర్యాదులు ఐక్యరాజ్య సమితి కవిలికట్ట నుంచి ఉప సంహరించనంత కాలం సమస్య పరిష్కారం కాదు. లక్షలాది మంది పౌరులు, సైనికులు  బలి పశువులవు తూనే ఉంటారు. ప్రజలు పాలన సర్జరీకి తలపడేవ రకే పాలకుల ‘సర్జికల్‌ ఆపరేషన్‌’లు!!
 

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 

abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top