వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)

Weekly Horoscope For 25th August To 31st August 2019 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. పనుల్లో స్వల్ప అవాంతరాలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఉత్సాహంగా వ్యవహారాలు కొనసాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.  ఆస్తి వివాదాలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యాపారాలలో లాభాలు దక్కి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కడంతో పాటు, బాధ్యతలు పెరుగుతాయి. కళారంగం వారికి మరింత ప్రోత్సాహం. వారం మధ్యలో వివాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పనులు సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి వివాదాలు తీరి లాభం పొందుతారు. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగి ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. నూతన పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆస్తి వివాదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఎంతటి వారినైన వాక్చాతుర్యంతో  ఆకట్టుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం.  ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆరోగ్యం కాస్త కుదుటపడుతుంది. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. గులాబి, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యవహారాలలో విజయం. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు, వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. పసుపు, తెలుపు రంగులు.  దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులు చేపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విలువైన సమాచారం అందుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం.  ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. భూ, గృహయోగాలు కలుగుతాయి. ఇంటాబయటా అనుకూలస్థితి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కుతాయి. కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. వివాదాల నుంచి బయటపడతారు. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో రావలసిన ప్రమోషన్లు అందుకుంటారు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
చేపట్టిన  పనులు చకచకా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పలుకుబడి కలిగిన వారి నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.  సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని గుర్తింపు పొందుతారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అవార్డులు దక్కే ఛాన్స్‌. వారం చివరిలో బంధువిరోధాలు. ధనవ్యయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి
శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.  ఆస్తి వ్యవహారాలలో సోదరులతో చర్చిస్తారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వాహనయోగం. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. ఉద్యోగ యత్నాలు సానుకూలం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.  ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో ఇంటాబయటా ఒత్తిళ్లు. అనారోగ్యం. గులాబీ,నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.  అంగారక స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులను ఆకట్టుకునే ప్రకటన రావచ్చు. ఆలోచనలు అమలు చేస్తారు.  జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మిత్రుల నుంచి ఒత్తిడులు. నలుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top