వారఫలాలు :10 సెప్టెంబర్‌ నుంచి 16 సెప్టెంబర్‌ 2017 వరకు

వారఫలాలు :10 సెప్టెంబర్‌ నుంచి 16 సెప్టెంబర్‌ 2017 వరకు


మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)

అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు. పాతబాకీలు వసూలవుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగావకాశాలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.



వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహాది శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. వ్యాపారాలు కాస్త పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు సత్కారాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. లేత నీలం, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.



మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. పాతమిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విశేష ఆదరణ లభిస్తుంది. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, లేత గులాబి రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.



కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మీపై ఉంచిన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. తెలుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.



సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సహాయం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతటి బాధ్యతనైనా సమర్థంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు జతకడతారు. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు రావచ్చు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసమస్యలు. లేత ఎరుపు, గులాబి రంగులు, పశ్చిమది  ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.



కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)

అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొన్ని సమస్యలు తీరి మనశ్శాంతి చేకూరుతుంది. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు అవార్డులు దక్కుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించండి.



తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)

రుణభారాలు తొలగుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంతకాలం ఎదురుచూసిన ఉద్యోగాలు దక్కుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారుల యత్నాలు సానుకూలం. వారం మధ్యలో వృథా ఖర్చులు. శ్రమ తప్పదు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.



వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రావలసిన సొమ్ము అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.



ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. గతంలోని కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తుల శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. మానసిక అశాంతి. గులాబి, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ స్తోత్రాలు పఠించండి.



మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, ఇళ్లు కొనుగోలు చేసే వీలుంది. మీ ఊహలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. నలుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.





కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఇంటర్వ్యూలు అందుతాయి. చర్చలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. విద్యార్థులకు విజయాలు వరిస్తాయి. వ్యాపారాలలో చిక్కులు తొలగి ముందుకు సాగుతారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.



మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)

అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. తీర్థయాత్రలు చేస్తారు. సోదరులు, సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. భూ వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు ఊహించని మార్పులు. కళాకారులకు ప్రయత్నాలు కాస్త మందగిస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబి, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top