స్వీట్‌ పొటాటో కట్లెట్స్‌

New variety Snack Items Sweet Potato Cutlets Recipe - Sakshi

స్నాక్‌ సెంటర్‌

కావలసినవి:
చిలగడదుంపలు – 4; బంగాళదుంప – 1; మెంతి ఆకు గుజ్జు – ముప్పావు కప్పు; ఉల్లి పాయల గుజ్జు – పావు కప్పు; పచ్చిమిర్చి పేస్ట్‌ – 1 టీ స్పూన్‌; అల్లం గుజ్జు – అర టేబుల్‌ స్పూన్‌; మామిడి గుజ్జు – అర టీ స్పూన్‌ (లేదా ఒక చెక్క నిమ్మరసం); జీలకర్ర పేస్ట్‌ – అర టీ స్పూన్‌; కారం – పావు టీ స్పూన్‌; కొత్తిమీర తురుము – పావు కప్పు; బ్రెడ్‌ పౌడర్‌ – అర కప్పు; ఉప్పు – తగినంత; నూనె – సరిపడా.

తయారీ:
ముందుగా బంగాళదుంప, చిలగడదుంపలను ముక్కలుగా కట్‌ చేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చిలగడదుంపలను ముద్దలా చేసుకుని.. అందులో మెంతి ఆకు గుజ్జు, ఉల్లిపాయల గుజ్జు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం గుజ్జు, మామిడి గుజ్జు లేదా నిమ్మరసం, జీలకర్ర పేస్ట్, కారం, కొత్తిమీర తురుము, బ్రెడ్‌ పౌడర్, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా మెత్తగా ముద్దలా చేసుకుని.. చివరిలో బంగాళదుంప ముక్కలను వేసుకుని అటూఇటూగా కలిపి.. కట్లెట్స్‌లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top