కూర్చుంటే నిలుచుంటే...ఆరోగ్యం!

Health Tips In Funday On 08/12/2019 - Sakshi

ఈ రోజుల్లో మనం తినే తిండి, జీవనవిధానం కారణంగా కొవ్వు కరిగించుకోవడం కోసం, ఆరోగ్యవంతమైన రక్తప్రసరణ కోసం ఎన్నో వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఇక బొద్దుగా ఉన్నవాళ్లకైతే ఎన్నో చిట్కాల చిట్టా ఉండనే ఉంటుంది. ‘ఉదయాన్నే ఆరింటికి అలారం పెట్టుకుని మరీ నిద్ర లేవాలి, జిమ్‌కి వెళ్లాలి, స్కిప్పింగ్‌ చేయాలి, జాగింగ్‌ చేయాలి, చాక్లెట్‌ తినడం ఆపెయ్యాలి, స్వీట్స్‌ తగ్గించాలి, ఐస్‌క్రీమ్స్‌ మానెయ్యాలి..’ ఇలా ఒక్కటా రెండా... చాలా పాటించాల్సి వస్తుంది. కానీ ఈ బిజీ లైఫ్‌లో ఎలాంటివారికైనా అవన్నీ క్రమం తప్పకుండా పాటించాలంటే చాలా కష్టం. అందుకే మరి ఎలాంటి శ్రమా లేకుండా ఒళ్లు తగ్గాలంటే ఈ మెషిన్‌ మనకు దగ్గరల్లో ఉండాలి. కూర్చుంటే కాళ్లకు అందేంత దగ్గరలో ఉండాలి. పడుకుంటే కాళ్లు దాని మీద పెట్టుకునేంత దగ్గరలో ఉండాలి. అంతకు మించి.. అదే స్టూల్‌ అయితే మరీ మంచిది. దాని మీదే కూర్చుని కూల్‌గా రిలాక్స్‌ అవుతుంటే దాని పని అది చేసేస్తుంది.

దీని ప్రత్యేకమైన ఆక్యుప్రెజర్‌ మ్యాట్‌ శరీరంలోని రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. దీనికి కనెక్ట్‌ చేసి ఒక రిమోట్‌ కూడా ఉంటుంది. దానిలో ఆటోమెటిక్‌ టైమ్‌ సెట్టింగ్‌ ఉంటుంది. దాంతో దీనిమీద నిలబడినా, కూర్చున్నా, పడుకున్నా ఆరోగ్యమే అన్నమాట. డయాబెటిస్, రక్తపోటు, ఆర్థరైటిస్, నరాల బలహీనత ఇలా చాలా అనారోగ్య సమస్యలను ఇది పరిష్కరిస్తుంది. దీని వల్ల అలసట, బద్ధకం, పని ఒత్తిడి వంటివి క్షణాల్లో మటుమాయం అవుతాయి. బరువు క్రమంగా తగ్గాలనుకునే వాళ్లకు ఇది చాలా మంచి చిట్కా. దీని ధర రూ.9 వేల వరకు ఉంది. ఇతర సౌకర్యాలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండవచ్చు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top