చూడు చూడు... మాయలోడు!

చూడు చూడు... మాయలోడు!


మనుషుల్లో రకాలు ఉన్నట్లే దొంగల్లోనూ ఉన్నారు. తెలివైన దొంగలు, తెలివిలేని దొంగలు, లెక్క దొంగలు, తిక్క దొంగలు. ఈ జాబితాలోని  తిక్క దొంగలు హస్తలాఘవం ప్రదర్శించడం మాత్రమే కాదు... ఇతరులను బకరాలను చేసి అప్పుడప్పుడూ తాము కూడా బకరాలవుతుంటారు. కావాలంటే ఈ జోక్ చదవండి.

 

 జడ్జి    :ఇంతకు ముందు ఎప్పుడైనా దొంగతనం చేశావా?

 దొంగ    :చేసి ఉండవచ్చు, చేయకుండా కూడా ఉండవచ్చు.

 జడ్జి    :నీ వెనుక ఏదైనా కుట్ర జరిగింది    అనుకుంటున్నావా?

 దొంగ    :జరిగి ఉండవచ్చు... జరగకపోయి ఉండవచ్చు.

 జడ్జి    :నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పు ఇస్తున్నాను...

 దొంగ    :ఎంత కాలం విధించారు? ఎప్పుడు విడుదల చేస్తారు?

 జడ్జి    :పది కావచ్చు,  పది హేను సంవత్సరాలు

 కావచ్చు. విడుదల చేయవచ్చు. చేయకపోవచ్చు.

 

 ఏదీ చెప్పకుండా తిక్కగా మాట్లాడే ఈ దొంగలాంటోడే పై కార్టూన్‌నులోని దొంగ. తన వెంటపడుతున్న వ్యక్తిని ఎలా బకరాని చేశాడో చూశారు కదా!వాస్తవాల నుంచే కాదు... కాల్పనిక ఊహాల్లో నుంచి కూడా బ్రహ్మాండమైన హాస్యం పుట్టించవచ్చు అని చెప్పడానికి ఇరాన్ కార్టూనిస్ట్ క్రైస్ట్ హోవెయాన్ వేసిన ఈ కార్టూనే మంచి ఉదహరణ. ఈ కార్టూన్ చూస్తుంటే, ‘ఇది పెన్ను అనుకుంటున్నావా? కాదు గన్ను’ డైలాగు గుర్తుకు వస్తుందా?

 అయితే ఓకే!              

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top